Advertisementt

`ఆర్ ఎక్స్ 100` ద‌ర్శ‌కుడి కొత్త చిత్రం టైటిల్‌ ఫిక్స్‌!

Wed 06th Feb 2019 10:20 PM
ajay bhupathi,rx 100,karthikeya,maha samudram,bellamkonda srinivas,samantha,havish  `ఆర్ ఎక్స్ 100` ద‌ర్శ‌కుడి కొత్త చిత్రం టైటిల్‌ ఫిక్స్‌!
ajay bhupati next film title fixed `ఆర్ ఎక్స్ 100` ద‌ర్శ‌కుడి కొత్త చిత్రం టైటిల్‌ ఫిక్స్‌!
Advertisement
Ads by CJ

వాస్త‌విక ప్రేమ‌క‌థ‌ని త‌న తొలి సినిమాకు క‌థావ‌స్తువుని చేసుకుని సంచ‌ల‌నం సృష్టించారు అజ‌య్ భూప‌తి. ఆయ‌న తీసిన `ఆర్ ఎక్స్ 100` ప్రేమ‌క‌థా చిత్రాల్లోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న అజ‌య్ భూప‌తి తొలి సచిత్రంతోనే నిర్మాత నుంచి కాస్ట్‌లీ  గిఫ్ట్‌ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా త‌రువాత అజ‌య్ నితిన్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నార‌ని, అత‌నితో కాదు మ‌రో హీరోతో చేయ‌బోతున్నార‌ని..ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు షికారు చేశాయి. చివ‌రికి అజ‌య్ భూప‌తి బెల్లంకొండ త‌న‌యుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌తో సినిమా చేయ‌బోతున్నాడు. 

`నువ్విలా` హీరో హ‌వీష్ స‌మ‌ర్ప‌ణ‌లో సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రానికి `మ‌హా స‌ముద్రం` అనే టైటిల్‌ని ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఫిక్స్ చేసేశాడు.  `ఆర్ ఎక్స్ 100` చిత్రాన్ని ప్రేమ‌లో మోస‌పోయిన ఓ యువ‌కుడి క‌థ‌గా తెర‌కెక్కించిన అజ‌య్ భూప‌తి త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాత్రం త‌న గురువు వ‌ర్మ దారిలోనే మాఫియా నేప‌థ్యంలో రూపొందించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో బెల్లంకొండ శ్రీ‌నివాస్ స‌ర‌స‌న స‌మంత‌ను అడుగుతున్న‌ట్లు వినిపిస్తోంది. 

బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా ప‌రిచ‌య‌మైన తొలి చిత్రం `అల్లుడు శీను`లో స‌మంత క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోనూ అదే జోడీని రిపీట్ చేయాల‌న్న‌ది అజ‌య్ భూప‌తి కోరిక‌. ఇందు కోసం ఇప్ప‌టికే స‌మంత‌తో చిత్ర బృందం సంప్ర‌దింపులు జ‌రునుతున్న‌ట్లు చెబుతున్నారు. స‌మంత పెళ్లి త‌రువాత సినిమాల ఎంపిక విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో అజ‌య్ భూప‌లి ఆఫ‌ర్‌ను అంగీక‌రిస్తుందా? అన్న‌ది అనుమాన‌మే అంటున్నారు. 

ajay bhupati next film title fixed:

ajay bhupati next film maha samudram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ