Advertisementt

అమితాబ్‌కు జ‌ల్సా.. రామ్‌చ‌ర‌ణ్‌కు..?

Wed 06th Feb 2019 10:38 PM
ram charan,amithab bachan,jalsa,amithab jalsa,sharukh mannat,puri cave  అమితాబ్‌కు జ‌ల్సా.. రామ్‌చ‌ర‌ణ్‌కు..?
ram charan new house worth 56 crore అమితాబ్‌కు జ‌ల్సా.. రామ్‌చ‌ర‌ణ్‌కు..?
Advertisement
Ads by CJ

`విన‌య విధేయ రామ‌` ఫ‌లితం నిరుత్సాహ ప‌ర‌చ‌డంతో సినిమాపై త‌న ఒపీనియ‌న్‌ని డైరెక్ట్‌గా చెప్పేసి త‌న త‌ప్పేమీ లేద‌ని లేల్చేసిన రామ్‌చ‌ర‌ణ్ వార్త‌ల్లో నిలిచాడు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వ లోపాల‌ని ఇండైరెక్ట్‌గా ఎత్తిచూపే ప్ర‌య‌త్నం చేసి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రామ్‌చ‌ర‌ణ్ మ‌రో సారి వార్త‌ల్లోకి ఎక్క‌బోతున్నాడు. అదీ త‌న సొంత ఇంటి విష‌యంలో..  బాలీవుడ్ క్రేజీ హీరో షారుక్‌ఖాన్ ఇల్లు `మ‌న్న‌త్` ఎంత పాపుల‌రో అంద‌రికి తెలిసిందే. అలాగే   బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ జ‌ల్సా, ప్ర‌తీక్ష కూడా అంతే పాపుల‌ర్ అయ్యాయి. ర‌జ‌నీకాంత్ ఖ‌రీదైన భ‌వంతితో పాటు టాలీవె్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ కేవ్‌(23 కోట్లు) కూడా  వార్త‌ల్లో నిలిచింది. 

ఇప్పుడు ఇదే జాబితాలో రామ్‌చ‌ర‌ణ్ కొత్త ఇల్లు కూడా చేర‌బోతోంది. హీరో రామ్‌చ‌ర‌ణ్ అంగ‌రంగ వైభంగా ముస్తాబు చేసిన కొత్త ఇంటిలోకి ఎంట‌ర్ కాబోతున్నారు.  హైద‌రాబాద్‌లోనే అత్యంత ఖ‌రీదైన ప్రాంతమైన‌ జూబ్లీహిల్స్‌లో దాదాపు 56 కోట్ల విలువ చేసే నూత‌న భ‌వింతిని రామ్‌చ‌ర‌ణ్‌ రీసెంట్‌గా కొనుగోలు చేసిన‌ట్లు తెలిసింది. దీని విలువ తెలిసిన వాళ్ల మైండ్ బ్లాంక‌వుతోంద‌ట‌.  గ‌త కొంత కాలంగా తండ్రి చిరంజీవితో క‌లిసి వుంటున్న రామ్‌చ‌ర‌ణ్ కొత్తగా జూబ్లీహిల్స్‌లో నూత‌న భ‌వంతిలోకి మార‌బోతున్నాడ‌ని తెలిసింది. ఇందు కోస‌మే 56 కోట్ల వ్య‌యంతో అబ్బుర‌ప‌రిచే రీతిలో ఓ భ‌వంతిని సిద్ధం చేసుకున్నార‌న్న‌ది తాజాగా వినిపిస్తోంది.

ram charan new house worth 56 crore:

ram charan new house cost 56 crore

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ