Advertisementt

శ్రీ విష్ణు ‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్

Thu 07th Feb 2019 01:23 PM
sree vishnu,thipparaa meesam,first look,sree vishnu movie  శ్రీ విష్ణు ‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్
Sree Vishnu’s ‘Thipparaa Meesam’ First Look శ్రీ విష్ణు ‘తిప్పరా మీసం’ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తిప్పరా మీసం సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవిష్ణు లుక్ చాలా కొత్తగా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పగిలిన అద్దాలు అతని క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నాయి. అసుర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో శ్రీవిష్ణుతో ఈయనకు ఇదే తొలి సినిమా. యాక్షన్ డ్రామాగా తిప్పరా మీసం తెరకెక్కుతుంది. నిక్కి తంబోలీ, రోహిణి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అచ్యుత్ రామారావు, బెనర్జీ, రవిప్రకాష్, రవి వర్మ, నవీన్ నేని, ప్రవీణ్, నేహా దేశ్ పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తిప్పరా మీసం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, అచ్యుత రామారావు, బెనర్జీ, రవి ప్రకాష్, రవి వర్మ, ప్రవీణ్, నేహా దేశ్ పాండే, లహరి, నవీన్ నేని, శ్రీకాంత్ అయ్యంగార్, పిల్ల ప్రసాద్ తదితరులు

సాంకేతిక నిపుణులు..

రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్

నిర్మాత: రిజ్వాన్

బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ ఓం సినిమా

కో ప్రొడ్యూసర్స్: ఖుషీ, అచ్యుత రామారావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ళ

సంగీతం: సురేష్ బొబ్బిలి 

సినిమాటోగ్రఫీ: సిధ్

ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల

ఆర్ట్: షర్మిల ఎలిశెట్టి

పిఆర్‌ఓ: వంశీ శేఖర్

Sree Vishnu’s ‘Thipparaa Meesam’ First Look:

The first look of hero Sree Vishnu’s upcoming movie ‘Thipparaa Meesam’ is unveiled.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ