Advertisementt

ఈ భామలు రాజమౌళికే షాకిచ్చారుగా?

Fri 08th Feb 2019 07:37 AM
alia bhatt,parineeti chopra,rajamouli,ntr,ram charan,rrr movie,remuneration  ఈ భామలు రాజమౌళికే షాకిచ్చారుగా?
Rajamouli Shocks With Bollywood Heroines Decisions ఈ భామలు రాజమౌళికే షాకిచ్చారుగా?
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి RRR అనే వర్కింగ్ టైటిల్ తో భారీ మల్లీస్టారర్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. RRR ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో రాజమౌళి అండ్ ఎన్టీఆర్, చరణ్ లు బిజీగా వున్నారు. RRR అప్పుడే సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి కావొస్తున్నపటికి.... రాజమౌళి ఇంకా ఆ మల్టీస్టారర్ లో నటించబోయే హీరోయిన్స్ పేర్లు ఫైనల్ చేయలేదు.  ఇంతలోపలే ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించబోయే హీరోయిన్స్ వీళ్ళే అంటూ మీడియాలో రోజుకో ఇద్దరు హీరోయిన్స్ పేర్లు తెర మీదకి వస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం వీళ్ళే ఎన్టీఆర్, చరణ్  హీరోయిన్స్ అంటూ ప్రకటించలేదు. దానితో రోజుకో ఇద్దరు పేర్లు మీడియాలో వినబడుతున్నాయి.

తాజాగా రామ్ చరణ్ కి బాలీవుడ్ చిన్నది అలియా భట్ ఫిక్స్ అయ్యిందంటూ.. ఎన్టీఆర్ కి ఇంకా ఫైనల్ అవ్వాలని వార్తలొచ్చాయి. అయితే హీరోయిన్స్ విషయంలో రాజమౌళి ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడో.. లేదంటే ఇంకా హీరోయిన్స్ విషయం రాజమౌళి పట్టించుకోవడం లేదో.. కానీ తాజాగా RRR హీరోయిన్స్ విషయంలో మరో బిగ్ న్యూస్ తెర మీదకి వచ్చింది. అదేమిటంటే రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కోసం బాలీవుడ్ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడని.. ఇప్పటికే అలియా భట్, పరిణీతి చోప్రాలను సంప్రదిస్తున్నాడని అంటున్నారు. 

అయితే పరిణీతి చోప్రా మరియు అలియా భట్ లు రాజమౌళికి భారీ షాకిచ్చినట్లుగా చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించేందుకు పరిణీతి నాలుగు కోట్లు డిమాండ్ చెయ్యగా.. అలియా భట్ ఆరు కోట్లు డిమాండ్ చేసిందట. అయితే వారు బాలీవుడ్ లో తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నే రాజమౌళికి చెప్పారట. మరి తెలుగులో అంత మొత్తం ఇచ్చి హీరోయిన్స్ ని పెట్టాలంటే నిర్మాతలకు దమ్ముండాలి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కి అయితే 1 నుండి 2 కోట్ల వరకే పారితోషకాలు ఇస్తున్నారు. మరి బాలీవుడ్ హీరోయిన్స్ కి ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అనేసరికి రాజమౌళి షాకయ్యాడట. మరి దానయ్య ఒప్పుకుంటే రాజమౌళి వారిని తీసుకొస్తాడు. అయితే అలియాని, పరిణీతి పారితోషకం కొద్దిగా తగ్గించుకోమని దానయ్య, రాజమౌళి అడిగే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

Rajamouli Shocks With Bollywood Heroines Decisions:

RRR Heroines: Bollywood Heroines Asked High Remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ