‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో హిట్ కొట్టి అనతి కాలంలోనే తనతో పాటు పరిచయమైన రెజీనా, రాశిఖన్నా వంటి వారిని పక్కకు నెట్టేసి దాదాపు అందరు యంగ్‌స్టార్స్‌తో రకుల్‌ప్రీత్‌సింగ్ నటించేసేంది. ఇప్పటికే ఆమె టాప్ యంగ్ హీరోలందరితో ఓ రౌండ్ వేసింది. కానీ ‘స్పైడర్’తో సహా ఒకటి రెండు భారీ ఫ్లాప్‌లు రావడం, ఉత్తరాది నుంచి పూజాహెగ్డే, కైరా అద్వానీ, ఇతర భాషల నుంచి సాయిపల్లవి, అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ ఇలా అందరు పోటీ పడటంతో ఆమె తన స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ‘ఖాకీ’ తర్వాత మరోసారి ‘దేవ్’లో కార్తి సరసన నటిస్తోంది. ఇలా కోలీవుడ్‌లో ఈమెకి అడపాదడపా చాన్స్‌లు వస్తున్నాయి. ఈమెకి దాదాపు తెలుగులో ఏడాది పాటు గ్యాప్ వచ్చింది.
కాగా ప్రస్తుతం ఈమె ‘వెంకీ మామ’లో నాగచైతన్య సరసన నటిస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ అయిన ‘కథానాయకుడు’లో శ్రీదేవి పాత్రను పోషించి బాలయ్యతో ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటలో ఆడిపాడింది. ఇక సీన్ కట్ చేస్తే బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలో బాలయ్య ‘హ్యాట్రిక్’ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందులో నాని ‘జెర్సీ’లో హీరోయిన్‌గా నటిస్తోన్న శ్రద్దాశ్రీనాథ్ నటించనుందని వార్తలు వచ్చాయి. మరోవైపు బాలయ్యతో కథానాయకుడులో జస్ట్ ఆడిపాడిన రకుల్, గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు, జయ జానకి నాయకా’ చిత్రంలో కూడా నటించింది. దాంతో బోయపాటి, బాలయ్యలు ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ పాత్రకు రకుల్‌ని ఎంపిక చేశారట. గతంలో రకుల్‌ప్రీత్‌సింగ్ మంచి ఊపులో, స్టార్ హీరోయిన్‌గా మారిన సమయంలో యంగ్ హీరోలతో తప్ప సీనియర్ స్టార్స్‌ని నో చెప్పింది.
కానీ ప్రస్తుతం ఆమె బాలయ్య విషయంలో కాస్త రాజీ పడిందనే చెప్పాలి. ఇక నేడు సీనియర్ స్టార్స్‌కి టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత వేధిస్తోంది. అనుష్క, నయనతార, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటివారితో సీనియర్ స్టార్స్ లాక్కోస్తున్నారు. ఇక బాలయ్యతో ఓకే చెప్పింది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి వారితో కూడా ఇక ఆమెకి ఇబ్బంది ఉండదనే చెప్పాలి. మొత్తానికి ఓ వైపు యంగ్ హీరో నాగచైతన్యతో మరో వైపు ఆమె తండ్రి వయసున్న బాలకృష్ణతో ఒకేసారి నటిస్తుండటంతో ఈ రెండింటిలో ఆమెని మరలా తెలుగులో ఏ చిత్రం నిలబెడుతుందో వేచిచూడాల్సివుంది.