Advertisementt

ల‌వ్‌స్టోరీస్ స్పెష‌లిస్ట్ చేతికి `అర్జున్‌రెడ్డి`రీమేక్‌!

Sun 10th Feb 2019 02:52 PM
bala,varma,arjunreddy tamil remake,arjun reddy,goutham menon,  ల‌వ్‌స్టోరీస్ స్పెష‌లిస్ట్ చేతికి `అర్జున్‌రెడ్డి`రీమేక్‌!
goutham menon replaces bala ల‌వ్‌స్టోరీస్ స్పెష‌లిస్ట్ చేతికి `అర్జున్‌రెడ్డి`రీమేక్‌!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా గ‌మ‌నాన్ని మార్చిన పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ `అర్జున్‌రెడ్డి`. కొత్త చిత్రాల ఒర‌వ‌డిలో ఓ గేమ్ ఛేంజ‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇంకా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తూనే వుంది. అలాంటి చిత్రాన్ని ఇప్ప‌టికే షాహీద్ క‌పూర్‌తో హిందీలో రీమేక్ చేస్తుండ‌గా, త‌మిళంలో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్‌తో రీమేక్ చేశారు. అయితే ద‌ర్శ‌కుడు బాల చిత్రాన్ని ఆశించిన స్థాయిలో రూపొందించ‌క‌పోవ‌డం వ‌ల్ల కొన్ని క్రియేటీవ్ విభేదాలు రావ‌డంతో ఫ‌స్ట్ కాపీ పై అసంతృప్తిని వెల్ల‌గ‌క్కిన నిర్మాత‌లు ఆ చిత్రాన్ని ర‌ద్దు చేసి మ‌ళ్లీ అదే హీరోతో మ‌రో ద‌ర్శ‌కుడు, హీరోయిన్‌తో ఫ్రెష్‌గా తెర‌పైకి తీసుకురాబోతున్న విష‌యం తెలిసిందే. 

ఈ చిత్రం నుంచి ద‌ర్శ‌కుడు బాల‌ను, అత‌ని టీమ్‌ను, త‌ను ఎంపిక చేసిన హీరోయిన్‌ను ప‌క్క‌న పెట్టిన నిర్మాత‌లు మ‌ళ్లీ ఫ్రెష్‌గా `అర్జున్‌రెడ్డి`ని రీమేక్ చేయ‌డానికి పూనుకుంటున్నారు. ఆ బాధ్య‌త‌ల్ని ల‌వ్‌స్టోరీస్ స్పెష‌లిస్ట్ గౌత‌మ్ మీన‌న్‌ను అప్ప‌గించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఆయ‌న‌తో సంప్ర‌దింపులు మొద‌లుపెట్టార‌ని, గౌత‌మ్ మీన‌న్ కూడా ఈ రీమేక్ చేయ‌డానికి సుముఖంగా వున్నార‌ని లేటెస్ట్ న్యూస్‌. గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌ల `ధృవ‌న‌చ్చ‌త్తిరం` పేరుతో విక్ర‌మ్ హీరోగా త‌మిళంలో ఓ  సినిమాను రూపొందించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో హీరో విక్ర‌మ్‌కి, ద‌ర్శ‌కుడు  గౌత‌మ్ మీన‌న్‌కి మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని, ఆ కార‌ణంగానే విక్ర‌మ్ కోర‌డంతో గౌత‌మ్ మీన‌న్ ఓకే చెప్పాడ‌ని త‌మిళ సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. 

అదే నిజ‌మైతే `అర్జున్‌రెడ్డి` త‌మిళ రీమేక్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన‌డం ఖాయం. ల‌వ్‌స్టోరీస్‌ని వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో గౌత‌మ్ మీన‌న్ స్పెష‌లిస్ట్‌. ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన  కాకా కాక‌, మిన్నాలే, ఏమాయ చేసావె వంటి చిత్రాలే ఇందుకు మంచి ఎక్జాంపుల్‌. 

goutham menon replaces bala:

love story special list goutham menon replaced bala

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ