అమ్మడు ఒకసారి కన్నుకొట్టేసరికి రాత్రికి రాత్రి ఆమెను అందరూ వరల్డ్ ఫ్యామస్ చేసేశారు. ఆమె పాపులారిటీ ఎంతలా పెరిగిపోయిందంటే.. ఆ వింక్ (కన్నుకొట్టడం) అనేదానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడంతోపాటు పేటెంట్స్ కూడా రాసిచ్చేశారు జనాలు. ఒకానొక సందర్భంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సరదాగా కన్ను కొడితే.. అందుకోసం ప్రియాప్రకాష్ వారియర్ ఇన్స్పిరేషన్ అని ఒక జాతీయ న్యూస్ చానల్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. అలా ఉండేది ఆమె సిచ్యుయేషన్.
అదే అమ్మడిని ఇప్పుడు ఇంటర్నెట్ తో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు జనాలు. నిన్నమొన్నటివరకూ పొగిడి నెత్తి మీద పెట్టుకున్న ఆమెను ఇప్పుడు ఎందుకు తిడుతున్నారా అనే కదా మీ సందేహం. రీసెంట్ గా అమ్మడు లిప్ లాక్ సీన్ ను టీజర్ గా వదిలారు. అందులో ఆమె కింద పెదవిని కుర్రాడు కాస్తగట్టిగానే తన పెదాలతో లాగిపట్టి వదిలాడనుకోండి. ఆ టీజర్ వచ్చిన కొద్ది రోజులకే హైద్రాబాద్ లోని మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో కొందరు స్కూల్ మరియు కాలేజ్ పిల్లలు ముద్దులు పెట్టుకొంటున్న వీడియోలు బయటకి వచ్చాయి. దాంతో.. అలాంటి వీడియోలు చూసే ఈ పిల్లలు అలా తయారవుతున్నారు. ఆ సినిమాలను రిలీజ్ అవ్వనివ్వకండి. అయినా స్కూట్ యూనిఫారం వేసుకునే పిల్లలు చేయాల్సిన పనులేనా ఇవి అని తిట్టిపోయడం మొదలెట్టి.. మెల్లగా ప్రియప్రకాష్ వారియర్ ను కూడా తిట్టడం మొదలెట్టారు జనాలు. దాంతో నిన్నమొన్నటివరకు తనను నెత్తిపై పెట్టుకున్నవారే ఇలా తిట్టడంతో ఏం చేయాలో పాలుపోని ప్రియ సైలెంట్ అయిపోయింది. అందుకే అనేది ఏ విషయానికైనా ఎక్కువ మిడిసిపడకూడదు అని.