Advertisementt

వచ్చే సంక్రాంతికి సైలెంట్‌ కిల్లర్‌ ఇదేనా?

Mon 11th Feb 2019 04:38 PM
dil raju,sankranthi race,nani,2020,dil and nani sketch,silent killer  వచ్చే సంక్రాంతికి సైలెంట్‌ కిల్లర్‌ ఇదేనా?
Dil Raju Sketch for Next Sankranthi వచ్చే సంక్రాంతికి సైలెంట్‌ కిల్లర్‌ ఇదేనా?
Advertisement
Ads by CJ

సంక్రాంతి పండుగకు ఎంత కాదనుకున్నా మూడు నాలుగు చిత్రాలకు స్కోప్‌ ఉంటుంది. దాంతో ప్రతి ఏడాది ఇదే సీజన్‌ కోసం బడా బడా స్టార్స్‌ బెర్త్‌లు రిజర్వ్‌ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. పెద్ద చిత్రాలు విడుదలయ్యే ఈ సీజన్‌లో చిన్న చిత్రాలను పోటీగా దింపడం చాలా రిస్క్‌గా అందరు నిర్మాతలు భావిస్తూ ఉంటారు. కానీ కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ఈ పోటీ పెద్ద లెక్కలోనిది కాదు. అంతేకాదు.. విడుదలైన బడా స్టార్ల చిత్రాల కంటే ఫలానా చిత్రం బాగుందని తెలిస్తే ఇక బాక్సాఫీస్‌ వద్ద తిరుగే ఉండదు. 

ఈ విషయం ఇటీవల కాలంలో కూడా ‘సోగ్గాడే చిన్ననాయనా, శతమానం భవతి, ఎఫ్‌2’ చిత్రాలతో నిరూపితం అయింది. ఇక వచ్చే ఏడాదికి స్టార్స్‌ తమ చిత్రాలను రిలీజ్‌ చేయాలని భావిస్తున్న తరుణంలో పొంగల్‌ రేసులో సైలెంట్‌ కిల్లర్‌గా తమ చిత్రాన్ని తేవాలని దిల్‌రాజు-నానిలు డిసైడ్‌ అయ్యారట. ఈ ఏడాది దిల్‌రాజు నిర్మిస్తున్న ‘మహర్షి, 96’ రీమేక్‌లు విడుదల కానున్నాయి. మరోవైపు నాని ఈ ఏడాది ‘జెర్సీ’తో పాటు విక్రమ్‌ కె.కుమార్‌ల చిత్రాలను ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక ఈయన ‘డి ఫర్‌ దోపిడి, అ’ ల తర్వాత ఎంతో తెలివిగా దిల్‌రాజుతో టై అప్‌ అయి ఓ చిత్రం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఓ చిత్రంలో తానే నటిస్తూ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. 

అందులో తొలి ప్రయత్నంగా తనకి ‘అష్టాచెమ్మా’తో బ్రేక్‌ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్‌రాజు- నానిల చిత్రం ప్రారంభం కానుంది. ఇక నానితో ‘అష్టాచెమ్మా’ మామ్రే కాదు.. ‘జెంటిల్‌మేన్‌’ వంటి హిట్‌ని అందించిన ఇంద్రగంటితో మొదట నాని-దుల్కర్‌సల్మాన్‌ల కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ రూపొందనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో దిల్‌రాజు, నానిలు మనసు మార్చుకుని సోలోగా నానితోనే చిత్రం తీయనున్నారని తెలుస్తోంది. మే లేదా జూన్‌లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో దీనిని సైలెంట్‌ కిల్లర్‌గా దింపాలనే ఆలోచనలో నాని-దిల్‌రాజులు ఉన్నారని సమాచారం.

Dil Raju Sketch for Next Sankranthi :

Dil Raju and Nani Film in 2020 Sankranthi Race

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ