ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను సినీ పరిశ్రమకు అందించిన దర్శకుడు విజయ బాపినీడు ఈ రోజు ఉదయం పరమపదించారు. మెగాస్టార్ చిరంజీవి కి అనేక హిట్ చిత్రాలను అందించాడు ఆయన. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ బాపినీడు హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కన్ను మూసారు. ఆయన మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. విజయ బాపినీడు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగిపోయింది. బిగ్ బాస్, మహానగరంలో మాయగాడు, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్, మగ ధీరుడు వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 86 ఏళ్ళ విజయ బాపినీడు సెప్టెంబర్ 22, 1936 లో ఏలూరు సమీపంలోని చాటపర్రు లో జన్మించిన ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. కెరీర్ తొలినాళ్లలో పత్రికా సంపాదకుడిగా పనిచేశారు విజయ బాపినీడు. ఇక రచయితగా, దర్శకుడిగానే కాదు విజయ బాపినీడు నిర్మాతగా కూడా సుపరిచితుడే.
విజయ బాపినీడు మరణ వార్త విన్న పరిశ్రమలోని చిన్న పెద్ద అందరూ ఆయన కి నివాళులర్పించడానికి, తుది వీడ్కోలు పలకడానికి ఆయన స్వగృహానికి తరలి వెళుతున్నారు.