Advertisementt

ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుందట

Wed 13th Feb 2019 11:28 AM
nagakanya,trailer,response,catherine,varalakshmi,jai,raai laxmi,nagakanya movie  ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుందట
Superb Response to Nagakanya Trailer ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుందట
Advertisement
Ads by CJ

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న ‘నాగకన్య’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరోగా నటిస్తున్నారు. జంబో సినిమాస్ బ్యానర్ పై ఏ. శ్రీధర్ నిర్మాతగా ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా... ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సూపర్ రెస్పాన్స్ సంపాదించుకోగా... ట్రైలర్ చూసిన వారంతా అద్భుతమైన ట్రైలర్ గా కొనియాడారు. పేరున్న హీరోయిన్స్... గ్రాండ్ విజువల్స్... రిచ్ గ్రాఫిక్స్... క్యూరియసిటీ తో కూడిన కథనంతో ఈ ట్రైలర్ విడుదల చేసారు. నాగ సర్పం నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ నటిస్తున్న నాగకన్య ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా మొదటి పోస్టర్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ని, రెండో పోస్టర్ గా లక్ష్మిరాయ్ లుక్ ని విడుదల చేశాం. మూడో పోస్టర్ గా కేథరీన్ లుక్ ని విడుదల చేశాం. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉన్నాం. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. జై క్యారెక్టర్ మరో హైలైట్ గా నిలుస్తుంది. డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాం. వరలక్ష్మి శరత్ కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ పాత్రలు వూహించని విధంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కు మంచి పేరొచ్చేలా ఉంటుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం..’’  అని అన్నారు 

Superb Response to Nagakanya Trailer:

Nagakanya Movie Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ