Advertisementt

అమెజాన్‌లో వచ్చేసింది.. అయినా దంచుతోంది

Wed 13th Feb 2019 01:53 PM
f2,amazon,amazon prime,venkatesh,records,housefuls,dil raju,varun tej  అమెజాన్‌లో వచ్చేసింది.. అయినా దంచుతోంది
Recent Release Movie Sensation in Amazon Prime అమెజాన్‌లో వచ్చేసింది.. అయినా దంచుతోంది
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాలు డిజిటల్ రైట్స్ దాదాపు అన్ని అమెజాన్ ప్రైమ్‌ వారే దక్కించుకుంటున్నారు. తెలుగులో చిన్న సినిమాలు నుండి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాలు అమెజాన్ ప్రైమ్‌ లో కనపడుతున్నాయి. రిలీజ్ అయినా 50 రోజులకి వచ్చేస్తున్నాయి. అలా అయితే పర్లేదు ఈమధ్య 30 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో దర్శనమిస్తున్నాయి.

అలానే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2 చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్‌లో దర్శనమిచ్చింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 11 అర్ధరాత్రి నుంచి అమెజాన్ సినిమాను లైవ్ స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలుగు స్టేట్స్ లో ఈసినిమా ఇంకా కొన్ని షోస్ హౌస్ ఫుల్ పడుతున్నాయి.

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సుదర్శన్ థియేటర్లో ఆదివారం నాలుగు షోలకు కలిపి రూ.2.5 లక్షల గ్రాస్ రావడం విశేషం. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా ఈసినిమాకి ఇంకా ఇటువంటి కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇక సోమవారం నుండి ఈసినిమా ఫ్రీ గా చూసే అవకాశం ఉంది కాబట్టి సోమవారం నుండి ఈసినిమా కలెక్షన్స్ డల్లయ్యేందుకు అవకాశముంది. ఎంతమంది ఈ ఫ్రీ ఉంటది చెప్పండి. సో ఈ వారాంతం వరకు సినిమా ఆడినా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతున్నా ఇంతలా సినిమా ఆడుతుందంటే దిల్ రాజు లక్కీ ఫెలో అనే చెప్పాలి. 

Recent Release Movie Sensation in Amazon Prime:

F2 Movie Released in Amazon Prime 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ