నాగచైతన్య, సమంత పెళ్లికి ముందు ప్రేమ పక్షులన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే ఈ ప్రేమికులు నటించిన `మజిలీ` సినిమా టీజర్‌ని ప్రేమికుల రోజున చిత్ర బృందం విడుదల చేస్తోంది. వివాహం తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నపేయిన్‌ఫుల్ లవ్‌స్టోరీ `మజిలీ`. `నిన్నుకోరి` ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ప్రేమ ఎక్కడ వుంటుందో పేయిన్ అక్కడే వుంటుంది (దేర్ ఈజ్ లవ్..దేర్ ఈజ్ పేయిన్) అనే ట్యాగ్ లైన్‌తో హార్ట్ టచింగ్ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు. తొలి సినిమా `నిన్నుకోరి`లో ఓ విఫల ప్రేమికుడి త్యాగాన్ని చూపించి ఆకట్టుకున్న శివ నిర్వాణ `మజిలీ` చిత్రంతో ప్రేమ, భార్యా భర్తల అనురాగం వాళ్లిద్దరి ప్రేమలో వుండే పెయిన్‌ని, ఫ్రస్టేషన్‌ని చూపించబోతున్నాడు.
నాగచైతన్య, సమంత భార్యభర్తలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వాళ్లిద్దరి మధ్య దూరాన్ని పెంచే పాత్రలో కొత్త నటి దివ్యాంశ కౌశిక్ కనిపించనుంది. 90వ దశకం నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే సినిమా వుండబోతోందని చిత్ర బృందం చెబుతోంది. ప్రేమికుల రోజైన ఈ నెల 14న టీజర్ విడుదలవుతున్న సందర్భంగా సమంత సినిమా గురంచి ఆసక్తికర ట్వీట్ చేసింది. `ఈ వాలెంటైన్స్ డే`ఉదయం 9:09 గంటలకు `మజిలీ` టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ప్రేమ, జీవితంలోని మధురానుభూతుల్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదిస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు` అని సమంత చేసిన ట్విట్ ఆకట్టుకుంటోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.