Advertisementt

కైరా, పూజా.. ఎవర్ని ఫైనల్ చేస్తారో?

Sun 17th Feb 2019 11:49 AM
allu arjun,kaira advani,trivikram srinivas,pooja hegde,movie,heroines  కైరా, పూజా.. ఎవర్ని ఫైనల్ చేస్తారో?
Fight Between Two Heroines for Bunny, Trivikram Film కైరా, పూజా.. ఎవర్ని ఫైనల్ చేస్తారో?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఇప్పుడు కాజల్‌అగర్వాల్‌, తమన్నా, శ్రియ వంటి వారి శకాలే కాదు.. రకుల్‌ప్రీత్‌సింగ్‌ వంటి వారి పని కూడా అయిపోయింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు సమంత, సాయిపల్లవి, కీర్తిసురేష్‌లు పోటీ పడుతున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, నిధిఅగర్వాల్‌, మెహ్రీన్‌ వంటి వారు రెండో స్థాయి హీరోలకు జోడీగా మారుతున్నారు. ఇక స్టార్‌ హీరోల దృష్టిని మాత్రం పూజాహెగ్డే, కైరా అద్వానీ వంటి వారు ఆకర్షిస్తున్నారు. నటనతో పాటు గ్లామర్‌షో ద్వారా కూడా వీరు మెప్పిస్తున్నారు. 

పూజాహెగ్డే విషయానికి వస్తే ఈమె ‘ముకుంద, ఒక లైలా కోసం, దువ్వాడజగన్నాధం (డిజె), సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ’ వంటి చిత్రాలతో తన సత్తా చాటింది. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్‌, పివిపి సంస్థలు వంశీపైడిపల్లి దర్శకత్వంలో తీస్తున్న ‘మహర్షి’లో నటిస్తోంది. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్‌25న విడుదల కానుంది. మరోవైపు ‘రంగస్థలం’లో ‘జిగేళ్‌రాణి’ అనే పాటలో చిందులేసిన ఈమె ప్రభాస్‌-జిల్‌ రాధాకృష్ణల కాంబినేషన్‌లో రూపొందుతోన్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీలో నటిస్తోంది. బాలీవుడ్‌లో ‘మొహంజదారో’లో నటించి, ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’లో స్థానం దక్కించుకుంది. 

ఇక కైరా అద్వానీ విషయానికి వస్తే ‘ఎం.ఎస్‌.ధోని’ ద్వారా అందరికీ పరిచయమైన ఆమె ఇటీవల మహేష్‌బాబుతో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో నటించింది. తాజాగా రామ్‌చరణ్‌-బోయపాటి శ్రీనుల ‘వినయ విధేయ రామ’లో యాక్ట్‌ చేసింది. ఇక విషయానికి వస్తే తన కెరీర్‌లో చాలా గ్యాప్‌ తీసుకున్న అల్లుఅర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నటీనటుల ఎంపిక సాగుతోంది. తన దర్శకత్వంలోనే వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’లో నటించి, త్రివిక్రమ్‌ని కూడా పూజాహెగ్డే మెప్పించింది. 

దాంతో త్రివిక్రమ్‌ బన్నీ చిత్రంలో ఆమెని మెయిన్‌ హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నాడు. కానీ బన్నీ మాత్రం ఆల్‌రెడీ తాను ‘డిజె’లో పూజాహెగ్డేతో నటించాను కాబట్టి కాస్త ఫ్రెష్‌గా కైరా అద్వానీని తీసుకోవాలని కోరుతున్నాడని తెలుస్తోంది. మరి చివరకు ఈ ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో వేచిచూడాల్సివుంది..! 

Fight Between Two Heroines for Bunny, Trivikram Film :

Bunny wants Kiara and Trivikram wants Again Pooja Hegde

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ