టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుని దాదాపు ప్రతి స్టార్‌తో చిత్రాలు తీసి మెప్పించిన దర్శకునిగా పూరీ జగన్నాధ్‌కి పేరుంది. సినిమాని వేగంగా, అదే సమయంలో క్వాలిటీ మిస్ కాకుండా తీయడంలో ఈయన నేర్పరి. ఇక ఈయన చిత్రాలలో హీరోల క్యారెక్టరైజేషన్స్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటాయి. పిచ్చిని పీక్స్‌లో చూపిస్తూ, తనదైన శైలిలో ఆయన హీరోల పాత్రలను మలుస్తారు. ఇక ఆయన మూవీస్‌లో రెండు మూడు శక్తివంతమైన సీన్స్‌లో చూపించే మొత్తాన్ని ఒకే ఒక్క డైలాగ్‌తో చూపించేస్తారు. ఆయన తయారు చేసే హీరోల పాత్రలు పిచ్చి, మెంటల్, తిక్క ఇలా బహువిచిత్రంగా ఉంటాయి.
కానీ ఆమధ్యకాలంలో ఆయన చిత్రాలను ప్రేక్షకులు రోటీన్‌గా ఫీలవుతున్నారు. ‘లోఫర్, రోగ్, పైసావసూల్, ఇజం’ ఇలా ప్రతి చిత్రంలో వైవిధ్యం లేకుండా తెరకెక్కుతుండటంతో ఈయనకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు ఏ యంగ్ హీరో అయినా పూరీ చిత్రంలో నటించి ఆయన చూపే హీరోయిజం ద్వారా లభ్దిపొందాలని కోరుకునే వారు. కానీ ఆయన వరుస పరాజయాలు ఎదురుకావడం.. నితిన్, కళ్యాణ్‌రామ్, వరుణ్‌తేజ్ వంటి వారు ఇచ్చిన అవకాశాలు కూడా వృధా కావడంతో పలువురు యంగ్ హీరోలు ఆయనను తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక ఎంతో కాలంగా రామ్ సైతం పూరీకి ఎస్ చెప్పలేదు. మరోవైపు రామ్ కెరీర్ కూడా వరుస ఫ్లాప్‌లలో ఉంది. నిజానికి రామ్‌కి సరైన దర్శకుడు, కథ, క్యారెక్టరైజేషన్ పడితే ఆయనలో దానిని పండించే సత్తా ఉన్న నటుడేనని చెప్పాలి.
ఇక ప్రస్తుతం పూరీ, రామ్‌ల కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్‌శంకర్’ రూపొందుతోంది. ఈ చిత్రంపై పూరీ, రామ్‌లు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. వాస్తవానికి ఈ చిత్రం కథను పూరీ తన కుమారుడు ఆకాష్ పూరీ కోసం తయారు చేశాడట. కానీ సన్నిహితులు మరీ కొత్తవాడితో కాకుండా కాస్త పేరున్న యంగ్‌హీరోతో చేయమని సూచించడంతో రామ్‌కి ఈ స్టోరీ చెప్పాడని తెలుస్తోంది. రామ్ కూడా మొదట ఈ కథని వినడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని, కానీ కథ విన్న తర్వాత తన ప్రాజెక్ట్స్ అన్నింటినీ పక్కనపెట్టి ఈ చిత్రానికి డేట్స్ కేటాయించాడని తెలుస్తోంది.
‘ఇస్మార్ట్‌శంకర్’లో రామ్ క్యారెక్టరైజేషన్ గత పూరీ చిత్రాల కంటే ఎంతో విభిన్నంగా, పిచ్చిపీక్స్‌లో ఉండే విధంగా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌లలో వచ్చే ట్విస్ట్‌లు పూరీ-మహేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘పోకిరి’ రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. మరి ‘ఇస్మార్ట్‌శంకర్’తోనైనా పూరీ, రామ్‌లు బౌన్స్ బ్యాక్ అవుతారేమో వేచిచూడాల్సివుంది...!