Advertisementt

‘ఐఐటీ కృష్ణమూర్తి’ ఫస్ట్ లుక్ వదిలారు

Mon 18th Feb 2019 10:45 PM
iit krishnamurthy,prudhvi dandamuri,maira doshi,first look,teaser release date,iit krishnamurthy first look  ‘ఐఐటీ కృష్ణమూర్తి’ ఫస్ట్ లుక్ వదిలారు
IIT Krishnamurthy First Look Launched, Teaser On Feb 24 ‘ఐఐటీ కృష్ణమూర్తి’ ఫస్ట్ లుక్ వదిలారు
Advertisement
Ads by CJ

క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ వారి ‘ఐఐటీ కృష్ణమూర్తి’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల.. ఫిబ్రవరి 24 న టీజర్..!!

పృథ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ లుక్‌లో ‘మిస్సింగ్- లాస్ట్ సీన్ సాటర్ డే ఈవినింగ్’ అనే క్యాప్షన్స్, సినిమాపై  మంచి ఇంట్రెస్ట్‌ను కలిగిస్తున్నాయి. ఇంకా ఈ పోస్టర్ లో సీరియస్ లుక్ లో హీరో కనిపిస్తూ ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటీ కలిగిస్తున్నారు. వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. వేసవి కానుకగా మే 28న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి నరేష్ కుమారన్ సంగీతం సమకూరుస్తుండగా, యేసు పి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమాని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు. 

నటీనటులు :  పృథ్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు.

సాంకేతిక నిపుణులు : 

దర్శకుడు: శ్రీ వర్ధన్

సమర్పణ: ప్రేమ్ కుమార్ పాత్ర

నిర్మాత: ప్రసాద్ నేకూరి

బ్యానర్: క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీ క్రిష్

సినిమాటోగ్రఫీ: యేసు.పి 

సంగీతం: నరేష్ కుమారన్

ఎడిటర్: అనిల్ కుమార్.పి

రచన: నాగార్జున మనపాక

గీత రచయిత: రామాంజనేయులు సంకర్పూ

లైన్ ప్రొడ్యూసర్: ఎల్.వి. వాసుకి

ప్రొడక్షన్ కంట్రోలర్: అశ్విన్, ఆనంద్ కుమార్

క్యాస్టింగ్: సూర్య తేజ

కలరిస్ట్: శ్రీనివాస్ మామిడి

పి.ఆర్.ఓ: సాయి సతీష్

IIT Krishnamurthy First Look Launched, Teaser On Feb 24:

Prudhvi Dandamuri and Maira Doshi are playing the lead roles in IIT Krishnamurthy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ