Advertisementt

ఏపీలో అలీకి ఘన సన్మానం.. ఎందుకంటే?

Tue 19th Feb 2019 01:05 PM
comedian ali,40 years,felicitations,andhra pradesh,ap cm chandrababu naidu  ఏపీలో అలీకి ఘన సన్మానం.. ఎందుకంటే?
Felicitations to Ali at Andhra Pradesh ఏపీలో అలీకి ఘన సన్మానం.. ఎందుకంటే?
Advertisement
Ads by CJ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా అలీ నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం

బాల నటుడిగా, కమెడియన్‌‌గా, హీరోగా, యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటుడు అలీ  టాలీవుడ్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకు న్నారు. 1979 లో ‘ప్రెసిడెంట్ పేరమ్మ’ చిత్రం ద్వారా బాలనటునిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలీ ఈ సంవత్సరంతో  నటుడిగా 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని నటుడు అలీని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘సంగమం’ వారు ఘనంగా సత్కరించనున్నారు. అలీ నాలుగు దశాబ్దాల సినీ జీవిత మహోత్సవం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 23వ తేది శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆడిటోరియంలో నిర్వహించనున్నది. ఈ విశేష కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్టు సంగమం సంస్థ వ్యవస్థాపకులు సంజయ్ కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. 

అలీ 40 ఏళ్ల సినీ జీవిత మహోత్సవ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, సినీరంగ ప్రముఖులు  శ్రీ కే రాఘవేంద్రరావు,  శ్రీ అశ్వినీదత్, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో అలీకి స్వర్ణకంకణం తొడిగి ఘనంగా సత్కరించనున్నామని సంజయ్ కిషోర్ వెల్లడించారు.  

Felicitations to Ali at Andhra Pradesh:

Ali 40 Years Celebrations Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ