మంచి కథ, యూనిట్ సపోర్ట్‌తో చేసిన ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - ఆడియో విడుదల కార్యక్రమంలో నిర్మాతలు గుర్నాధరెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి
గురునాథ రెడ్డి సమర్పణలో ఎ.బి.టి క్రియేషన్స్ బ్యానర్‌పై రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హరి గౌడ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాయ్ లక్ష్మీ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం మా యూనిట్ అంతటికీ చాలా స్పెషల్ మూవీ. సినిమా కోసం మా యూనిట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఎక్కువ యంగ్ టీం పనిచేసింది. చాలా మంది నిర్మాతలుంటారు. కానీ సినిమాలంటే ప్యాషన్ ఉండే నిర్మాతలు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో శ్రీధర్ రెడ్డి ఒకరు. ఈ సినిమా మేకింగ్‌లో మా యూనిట్‌కు ఆయన అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీగా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమాటోగ్రాఫర్ ఆర్.శాఖమూరి అద్భుతమైన విజువల్స్ అందించారు. హరి గౌర ఫేబులస్ సంగీతాన్ని అందించారు. అలాగే రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ, మధు నందన్, ప్రవీణ్ పాత్రలు సహా అందరూ చక్కగా నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు.
చిత్ర సమర్పకుడు గుర్నాధరెడ్డి మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ కిషోర్, కథ చెప్పినప్పుడు ఎంత ఎగ్జయిట్ అయ్యామో సినిమా మేకింగ్‌లో అంతే ఎగ్జయిట్ అయ్యాం. సినిమా చాలా బావుంటుంది. సినిమా కోసం పనిచేసిన వారందరూ వారి సినిమాలా భావించి ఈ సినిమా కోసం కష్టపడ్డారు. తప్పకుండా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు.
నిర్మాత ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి సినిమా చేద్దామని వచ్చాడు. మా జిల్లా నుండి వెళ్లిన నిర్మాతలు సినిమాల్లో నష్టాలే చూశారని చెప్పాం. అయితే తను మంచి సినిమా చేద్దామని, తను ముందుండి చూసుకుంటానని చెప్పడంతో సరేనన్నాం. ముందు వేరే కథ విన్నాం. అయితే చివరకు కిరణ్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాం’’ అన్నారు.
నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీ అంతా మాయ.. వద్దు అని మాకు తెలిసిన వాళ్లు చెప్పారు. కానీ ఇక్కడకు వస్తే మాకు ఎలాంటి చెడు కనపడలేదు. మంచి కథను నమ్ముకుని, మంచి టీంతో కలిసి పనిచేస్తే తప్పకుండా మంచి అవుట్‌పుట్ వస్తుందనడంలో సందేహం లేదు. అందుకు మా సినిమా ఎగ్జాంపుల్ అవుతుందనుకుంటున్నాం. ఈ సినిమా ప్రారంభం నుండి ఇప్పటి వరకు మేజర్ క్రెడిట్ శ్రీధర్ రెడ్డిగారికే దక్కుతుంది. టైటిల్ చూడగానే వెంకట లక్ష్మీ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పాత్రను ఎవరు చేయాలా? అని అనుకున్నప్పుడు మాకు రాయ్‌లక్ష్మీగారైతే చక్కగా సరిపోతారనిపించింది. ఆమె చాలా అద్భుతంగా నటించారు. అయితే ముందు ఆమె ఒప్పుకుంటారో లేదోనని అనుకున్నాం. అయితే ఆమె కథ వినగానే చేయడానికి ఒకే చెప్పారు. ఎంతో సహకారం అందించారు. మాకు ఇచ్చిన డేట్స్ కంటే ఎక్కువగానే వర్క్ చేశారు. ఆమె అందించిన సహకారానికి థాంక్స్. డైరెక్టర్ కిషోర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రామ్ కార్తీక్, పూజిత సహా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ మనసు పెట్టి కష్టపడ్డారు. తప్పకుండా సినిమా అందిరినీ మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నాకు మంచి నిర్మాతలు దొరికారు. శ్రీధర్ రెడ్డిగారు అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి విషయానికి ఆయన మమ్మల్ని ముందుండి నడిపించారు. అందరూ మన సినిమా అని కష్టపడి పనిచేశాం. సినిమాటోగ్రాపర్ వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్‌గారు, రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ, మధునందన్‌గారు, ప్రవీణ్‌గారు, అందరూ ఒక ఎత్తు అయితే రాయ్ లక్ష్మీగారు మరో వైపు నిలబడి సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.
అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత శ్రీధర్ రెడ్డిగారితో ఎప్పటి నుండో మంచి పరిచయం ఉంది. ఆర్.ఎక్స్ 100 చేసే సమయంలో నేను పడ్డ కష్టం, తపన.. ఇప్పుడు శ్రీధర్ రెడ్డిలో చూశాను’’ అన్నారు.
మధు నందన్ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతలు గుర్నాధరెడ్డి, ఆనంద్‌రెడ్డి, ఆర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డికి, దర్శకుడు కిషోర్‌కు థాంక్స్. నా కోసం మంచి పాత్రను డిజైన్ చేసి రాసిన రైటర్ కిరణ్‌గారికి థాంక్స్’’ అన్నారు.
రామ్‌కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘అందరం ఓ కుటుంబంలా కష్టపడి సినిమా చేశాం. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. టైటిల్ పాత్రలో నటించిన రాయ్ లక్ష్మీగారికి, పూజితకు థాంక్స్’’ అన్నారు.
పంకజ్ కేసరి మాట్లాడుతూ.. ‘‘దర్శక నిర్మాతలకు, రాయ్ లక్ష్మీ సహా ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. మూడు నాలుగు రోజుల్లో రీరికార్డింగ్ కూడా పూర్తవుతుంది. అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
రైటర్ కిరణ్ మాట్లాడుతూ.. ‘‘కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాను. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం. రాయ్ లక్ష్మీగారి పాత్ర కీలకంగా ఉంటుంది. రామ్‌కార్తీక్, పూజిత సహా అందరూ చక్కగా చేశారు’’ అన్నారు.