Advertisementt

శివ మంచి కథ చెప్పాడంటున్న దంపతులు

Sat 23rd Feb 2019 08:17 PM
majili,samantha,naga chaitanya,shooting completed,shiva nirvana,majili update  శివ మంచి కథ చెప్పాడంటున్న దంపతులు
Majili Movie Shooting Completed శివ మంచి కథ చెప్పాడంటున్న దంపతులు
Advertisement
Ads by CJ

షూటింగ్ పూర్తి చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంతల మ‌జిలీ.. ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్‌

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘మ‌జిలీ‘. ‘ఏమాయ‌చేసావె, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం’ చిత్రాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుని... పెళ్లి చేసుకున్న‌ చైత‌న్య‌, స‌మంత..  పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న తొలి చిత్రం ‘మ‌జిలీ’.  ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మంత‌తో పాటు దివ్యాంశిక కౌశిక్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య యువ క్రికెట‌ర్‌గా, పెళ్లైన యువ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కింది. వేలంటెన్స్ డే నాడు విడుద‌లైన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. 

అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ.. ‘‘షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం గొప్ప అనుభూతినిచ్చింది. శివ నిర్వాణ అద్భుత‌మైన క‌థ‌ను చెప్పారు. ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. 

స‌మంత అక్కినేని మాట్లాడుతూ.. ‘‘మ‌జిలీ షూటింగ్ పూర్త‌య్యింది. చాలా మంచి టీంతో క‌లిసి పనిచేయ‌డం ఆనందంగా ఉంది. ఏప్రిల్ 5 కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు. 

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్‌, రావు ర‌మేష్‌, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఓ: వ‌ంశీ-శేఖ‌ర్‌, యాక్ష‌న్‌: వెంక‌ట్‌, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: సాహి సురేష్‌, సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శ‌ర్మ‌, సంగీతం: గోపీసుంద‌ర్‌, నిర్మాత‌లు: సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌.

Majili Movie Shooting Completed :

Majili Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ