దర్శకుడు తేజ చాలారోజులకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో లైం టైం లోకొచ్చాడు. రానాతో తెరకెక్కించిన ఆ సినిమాతో దర్శకుడు తేజ మళ్ళీ క్రేజ్ సంపాదించాడు. అయితే ఆ సినిమా చూసిన బాలకృష్ణ.. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను అప్పగించాడు. తేజ కూడా చాలా శ్రద్దగా ఎన్టీఆర్ గురించి తెలుసుకుని.. ఆయన ఫ్యామిలీ విషయాలు, రాజకీయ విషయాల మీద చర్చించి.. స్క్రిప్ట్ రాసుకుని మరీ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని సెట్స్ మీదకి తీసుకొచ్చాడు. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అంగరంగ వైభవంగా మొదలైంది. ఇక తేజ మొదటి షెడ్యూల్ పూర్తి కాకముందే ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడు. అప్పట్లో బాలకృష్ణ చేసే చేష్టలకు భయపడే తేజ బయటికొచ్చేశాడన్నారు.
ఇక తేజ తప్పుకోవడం దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను చేపట్టి... చకచకా రెండు పార్టులుగా సినిమాని పూర్తి చేసి నెలకో సినిమా చొప్పున విడుదల చెయ్యడం జరిగింది. క్రిష్ 200 రోజుల పాటు మహా యజ్ఞంలా ఈ ఎన్టీఆర్ బయోపిక్ పనులు పూర్తి చేసి సినిమాని విడుదల చేసాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాకి, మహానాయకుడు సినిమాలకు దారుణమైన ఓపెనింగ్స్ రావడంతో.. రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యేలా కనబడుతుంది వ్యవహారం. కథానాయకుడుకి హిట్ టాక్ వచ్చినా.. సినిమా కలెక్షన్స్ చూస్తే భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక కథానాయకుడిలో చేసిన తప్పులను సవరించి మహానాయకుడు చేస్తే ఆ సినిమా కూడా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు.
మరి అలా క్రిష్ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు సినిమాలు ప్లాప్ లిస్ట్ లో చేరి.. క్రిష్ కి చెడ్డపేరు తీసుకురాగా.. ఇప్పుడు తేజ అదృష్టవంతుడు అయ్యాడు. తేజ ఆ సినిమా నుండి తప్పుకుని ఆ ప్లాప్ నుండి తప్పించుకున్నట్లే అంటున్నారు. పాపం అలా ఎన్టీఆర్ బయోపిక్ లో క్రిష్ బుక్ అవగా.. తేజ సేవ్ అయ్యాడు. లేదంటే క్రిష్ కి పడుతున్న నెగెటివ్ కామెంట్స్ అన్ని.. అప్పుడు తేజకి పడేవి. మరి ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను మోయలేక సినిమా నుండి తప్పుకున్నానని చెప్పి తేజ తెలివిగా తప్పించుకున్నట్లే కదా...!