Advertisementt

‘సైరా’ షూటింగ్‌ను అడ్డుకున్నారు!

Mon 25th Feb 2019 11:17 PM
sye raa,shooting break,bahumani port,locals,chiranjeevi  ‘సైరా’ షూటింగ్‌ను అడ్డుకున్నారు!
Unexpected Break for Sye Raa ‘సైరా’ షూటింగ్‌ను అడ్డుకున్నారు!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి - సురేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో భారీ లెవెల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌కు అనుకోకుండా బ్రేక్ పడింది. బీదర్‌లో వారం రోజులు పాటు షూట్ చేయడం కోసం అన్ని పర్మిషన్లు, అంతా సెట్ చేసుకుని వెళితే.. ఊహించని కారణాలతో షూటింగ్‌కు బ్రేక్ పడింది.

వివరాలలోకి వెళ్తే షూటింగ్ కోసం సైరా టీం బీదర్‌కు వెళ్ళింది. అక్కడ బహుమనీ కోటలో షూటింగ్ జరిపేందుకు వెళ్లిన సైరా టీమ్ చేతుల్లో కత్తులు, తలపాగాలు, గెడ్డాలు, గెటప్‌లు ఇవన్నీ చూసిన తరువాత కొంతమంది లోకల్స్ అభ్యంతరం చెప్పారట. అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పినా ఒప్పుకోలేదట. లోకల్స్‌ని కాదనుకుని చేసేది ఏమి లేక టీం వెనక్కు వచ్చేసింది.

ఇక హైదరాబాద్ కోకాపేట్‌లో వేసిన భారీకోట సెట్ లో షూట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. రోజులు గడిచే కొద్దీ సినిమా వెనక్కి వెళ్తూనే ఉంది. ఇప్పటివరకు సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వలేదు రామ్ చరణ్. చిరు కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా చరణ్ ఈ సినిమాను సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

Unexpected Break for Sye Raa:

Sye Raa Shooting Stopped at Bihar 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ