బాలకృష్ణ తండ్రి జీవిత చరిత్రని తెరకెక్కించి చేతులు కాల్చుకోవడమే కాదు.. ఎన్టీఆర్‌కున్న గౌరవాన్ని కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులుతో మొత్తం పోగెట్టేసాడు. ఎన్టీఆర్ మీదున్న అభిమానం, గౌరవం అన్నీ ఈ ఎన్టీఆర్ బయోపిక్ తో అభిమానుల్లో తుడిచిపెట్టుకుపోయిందేమో అనిపించేలా ఉంది.. కథానాయకుడు డిజాస్టర్, మహానాయకుడు కలెక్షన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవం. అలాంటి వ్యక్తిని బయోపిక్ పేరుతో బజారుకీడ్చారన్నట్టుగా వుంది తాజా వ్యవహారం. అయితే ఇదంతా బాలకృష్ణ స్వయంకృతాపరాధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కథానాయకుడు సినిమాని ఎన్టీఆర్ ని దైవంగా చూపించినా.. ఆ సినిమా హిట్ అయినా... ఎన్టీఆర్ మీద చేసిన భజన భరించలేక ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొట్టారు.
మరి మహానాయకుడు అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తియ్యాల్సింది పోయి... బాలకృష్ణ ఈ సినిమాలో బావ భజన చూపించాడు. ఎన్టీఆర్ ని హీరోగా చూపించాల్సింది పోయి.. బావ చంద్రబాబు భజన చేయించడంతో ప్రేక్షకులు మాత్రమే కాదు.. నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాని తిప్పికొట్టారు. అసలు టిడిపికి ఫేవర్‌గా ఉంటుందనే ఒకే ఒక్క విషయంతో చాలామంది ఈ సినిమా చూడలేదు అంటే నమ్మాలి. మరి అందుకే మహానాయకుడుకి అంత దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి.
చంద్రబాబు.. బావమరిది బాలకృష్ణకి డబ్బులిచ్చి మరీ టిడిపికి ఆయనకి ఫేవర్‌గా మహానాయకుడు చిత్రాన్ని తీసి 2019 ఎన్నికల్లో గెలిచెయ్యాలనుకుంటే.. ఫలితం ఎలా ఉందో చూసారుగా... మరి ఇదంతా క్రిష్ తప్పుకాదు.. బాలయ్య చెప్పింది చేసాడు క్రిష్. క్రిష్ అనుకున్నది వేరు. కానీ బాలకృష్ణ చెప్పింది చెయ్యకపోతే.. క్రిష్ కి ఇబ్బంది కనుకనే.. ఇలా బాలయ్య చెప్పింది చేసి క్రిష్ కూడా ఇరుక్కున్నాడు. అయినా బాలకృష్ణ ఏదో ఆశించి తండ్రి జీవిత చరిత్రని తెరకెక్కిస్తే... మరేదో అయ్యింది. కనుక ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ బాధ్యతంతా బాలయ్య మోయాల్సిందే.