Advertisementt

మెగా కాంపౌండ్ నుండి నానికి గ్రీన్ సిగ్నల్

Tue 26th Feb 2019 10:52 PM
nani,gangleader,mega compound,title controversy,nani 24,nani gangleader,gang leader  మెగా కాంపౌండ్ నుండి నానికి గ్రీన్ సిగ్నల్
Title Controversy: Green Signal to Nani From Mega Compound మెగా కాంపౌండ్ నుండి నానికి గ్రీన్ సిగ్నల్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అంతా నానిపై ఫైర్ అవుతున్నారు. అందుకు కారణం నాని తన నెక్స్ట్ మూవీకి గ్యాంగ్ లీడర్ టైటిల్‌ని వాడుకోవడమే. అప్పటిలో గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అటువంటి పవర్ ఫుల్ టైటిల్ ను మెగాస్టార్ చిరంజీవి కాకుండా లేదా మెగా హీరోస్ కాకుండా వేరే వాళ్ళు వాడుకోవడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ మాత్రమే అని వీలైనంత త్వరగా టైటిల్ మార్చమని మెగా ఫ్యాన్స్ బాగానే రచ్చ చేస్తున్నారు. అసలు ఈ టైటిల్ గీతా ఆర్ట్స్ కానీ, కొణిదెల ప్రొడక్షన్స్ వారు గాని ముందే రిజిస్టర్ చేయించుకుని ఉంటే ఇప్పుడు ఆ టైటిల్‌ను వేరే వాళ్లు వాడేసుకునేవారు కాదు కదా అని అంటున్నారు ఫ్యాన్స్. ముందే రిజిస్టర్ చేయించి ఉంటే ఫ్యూచర్ లో రామ్ చరణ్‌కి లేదా అల్లు అర్జున్ కానీ సినిమా చేసుకునే పని అని అంటున్నారు.

అయితే ఇంత రచ్చ జరుగుతుంటే మెగా కాంపౌండ్ ఎవరూ స్పందించరా? అంటే అంటే అది కూడా జరిగింది. కానీ అటువైపు నుంచి వేరే వెర్షన్ వచ్చిందట. ఇలా చిరంజీవి నటించిన సినిమాల్లో మెయిన్ మెయిన్ టైటిల్స్ అన్ని రిజిస్టర్ చేయించుకుని వెళ్తే మనీ వేస్ట్ అవుతుంది తప్ప వేరేది ఏమి లేదు అని అంటున్నారు. నిజమే చిరంజీవి 150 సినిమాల్లో ఎంత లేదన్నా అలాంటివి యాభైకి పైగానే ఉన్నాయని మరి వాటిని ఎలా మేనేజ్ చేయాలనీ ప్రశ్నించారట. ఇందులో లాజిక్ లేకపోలేదు. సో మెగా కాంపౌండ్ నుండి నాని కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే.

Title Controversy: Green Signal to Nani From Mega Compound:

Positive Response to Nani Film Title From Mega Compound

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ