గత కొంతకాలం నుండి హీరో రవితేజకు ఎందుకో కలిసి రావడం లేదు. మొన్నటివరకు మినిమం గ్యారంటీ హీరోలా ఉన్న రవితేజకు గత ఏడాది మూడు డిజాస్టర్స్ వచ్చాయి. వరసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది. దాంతో అతని పారితోషికం కూడా సగానికి పడిపోయిందనే వార్తలొస్తున్నాయి.
తను సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ వల్లే సినిమాలు ఫెయిల్ అవ్వుతున్నాయి అని గ్రహించి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు వి.ఐ. ఆనంద్‌తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసుకోకపోయినా కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది.
పాజిటివ్ వైబ్స్ తో సినిమా షూటింగ్ వెళ్తున్న సమయానికి చిత్రయూనిట్‌కు ఒక షాక్ తగిలింది. డిస్కో రాజా కథ ఆల్రెడీ నిర్మాణంలో వున్న ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కథకి దగ్గరగా వుందని తెలిసింది. విషయం తెలుసుకున్న రవితేజ రెండు కథలు పక్కపక్కనే పెట్టి సిమిలర్‌గా ఏ పాయింట్స్ కలుస్తున్నాయో.. అవి డైరెక్టర్ కి చెప్పి మార్చమని చెప్పాడట. దాంతో షూటింగ్ మొదలు కావాల్సిన ఈ చిత్రం మరోసారి డ్రాయింగ్ బోర్డ్‌కి వెళ్లింది. ఆ మార్పులు అయ్యాకే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది.