Advertisementt

సాయిధరమ్ సినిమాకి కోత మొదలైంది

Thu 28th Feb 2019 06:35 PM
chitralahari,saidharam tej,budget,reduced,makers,mythri movie makers,kishore tirumala  సాయిధరమ్ సినిమాకి కోత మొదలైంది
Sai Dharam Tej Movie Chitralahari in Budget Control సాయిధరమ్ సినిమాకి కోత మొదలైంది
Advertisement
Ads by CJ

తన మొదటి సినిమాతో హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్‌కు గత 6 చిత్రాలు నుంచి అంతగా కలిసి రావడంలేదు. 6 మూవీస్ వరసగా ప్లాప్ అవ్వడంతో తేజు మార్కెట్ కూడా బాగా దెబ్బ తింది. 2015లో సుప్రీమ్ సినిమా తరువాత ఇంతవరకు చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు తేజుకి. అతను ప్రస్తుతం చేసే ‘చిత్రల‌హరి’ ఫలితం బట్టే తన ఫ్యూచర్ ఆధారపడి ఉంది.

నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నప్పటికీ బడ్జెట్ విషయంలో మాత్రం బాగానే కోతలు పడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈసినిమాను 20 కోట్లు లో తీద్దాం అనుకున్నారు కానీ తేజు మార్కెట్ పడిపోవడంతో 16 కోట్లకు ఫిక్స్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం 16 కూడా కాదని.. ఇంకా తక్కువ బడ్జెట్‌తో రూపొందించారని టాక్. 14 కోట్లలోనే సినిమాని పూర్తి చేసేలా కనిపిస్తున్నారట నిర్మాతలు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమాలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ వారు నిర్మిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వడం మెగా మేనల్లుడుకి చాలా అవసరం.

Sai Dharam Tej Movie Chitralahari in Budget Control :

Chitralahari Movie Budget reduced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ