Advertisementt

‘లక్షీస్ ఎన్టీఆర్’పై ఆ వార్తలు నిజం కాదంట

Thu 28th Feb 2019 10:32 PM
lakshmis ntr,release date,makers,rgv,lakshmis ntr movie,rumours,rakesh reddy,ram gopal varma  ‘లక్షీస్ ఎన్టీఆర్’పై ఆ వార్తలు నిజం కాదంట
Various News about Lakhsmis NTR Business are false says makers ‘లక్షీస్ ఎన్టీఆర్’పై ఆ వార్తలు నిజం కాదంట
Advertisement
Ads by CJ

‘‘లక్షీస్ ఎన్టీఆర్’’ డిస్ట్రిబ్యూషన్ హక్కుల గురించి వస్తున్న పుకార్లను నమ్మొద్దు, సినిమా విడుదల మార్చి 22: దర్శక నిర్మాతలు.

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టిపారేసారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరెవరో ఏదో రేట్‌కి కొన్నారు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, ఎవరికి ఏ ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు జి.వి ఫిలింస్, రామ్ గోపాల్ వర్మ మరియు రాకేష్ రెడ్డిలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.

మార్చి 22న విడుదల.

ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ట్రైలర్, ఓ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ థియేట్రికల్ ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఆర్జీవి యూట్యూబ్ చానల్లో కోటికి పైగా మంది చూసారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘‘నీ ఉనికి’’ అనే సాంగ్ ను కూడా 30 లక్షల మందికి పైగా చూశారు. వీటన్నిటినీ చూస్తుంటే ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమాకు రేపు మార్చి 22న థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టడం ఖాయం. ఈ సంవత్సరంలో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ గా మారిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ చిత్రం వేసవి కాలం పూర్తిగా రాకముందే అందరిలో వేడి సెగలు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

టెక్నీషియన్స్:

బ్యానర్స్: జివి ఫిల్మ్స్, ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్

దర్శకత్వం: రాం‌మ్‌గోపాల్ వర్మ మరియు అగస్త్య మంజు

నిర్మాతలు: రాకేష్ రెడ్డి మరియు దీప్తి బాలగిరి

సినిమాటోగ్రఫీ: రమ్మీ

రచన: రామ్ గోపాల్ వర్మ మరియు నరేంద్ర చారి

మ్యూజిక్: కళ్యాణ్ కోడూరి

ఎడిటర్: కమల్ ఆర్

కాస్ట్యూమ్ డిజైనర్: వెంకటేష్ జక్కుల

కొరియోగ్రఫీ: శంకర్ మాస్టర్

లిరిక్స్: సిరాశ్రీ

పిఆర్‌ఓ: జి.ఎస్.కె మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్య చౌదరి

ప్రొడక్షన్ కంట్రోలర్: పాండి

సౌండ్ డిజైన్: యతి రాజు

Various News about Lakhsmis NTR Business are false says makers:

Lakshmis NTR Release date Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ