Advertisementt

తారక్ చెప్పినట్లే.. కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు

Fri 01st Mar 2019 10:19 PM
kalyan ram,jr ntr,ntr arts,tarak,advise,jr ntr and kalyan ram,118 movie  తారక్ చెప్పినట్లే.. కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు
Kalyan Ram Follows His Brother Tarak Advise తారక్ చెప్పినట్లే.. కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు
Advertisement
Ads by CJ

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వేరే బ్యానర్స్ లో అవకాశం వచ్చినా.. తన సొంత బ్యానర్ లోనే సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు. ఈ క్రమంలో ఆయన చాలా నష్టపోయాడు. ఒక టైములో బాగా కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ తనకి ‘జై లవకుశ’ చేసి పెట్టాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు వచ్చినా.. ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ రామ్ లాభపడ్డారు. 

ఇంక ఆ తర్వాత ప్రొడక్షన్ జోలికి పోలేదు. తనకు బయట కూడా మంచి మార్కెట్ ఉండడంతో రిస్క్ లేకుండా బయట బ్యానర్ లో సినిమాలు చేయాలనీ, తారక్ సలహా ఇచ్చాడట. కొన్నాళ్ళు తరువాత మన బ్యానర్‌లో నేను సినిమా చేస్తానని.. ఈలోగా ప్రొడక్షన్ జోలికి పోవద్దని హితబోధ చేశాడట తారక్.

తమ్ముడు చెప్పడంతో కళ్యాణ్ ఆ ప్రొడక్షన్ జోలికి అసలు పోవడంలేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన 118 చిత్రం తన ఫ్రెండ్ మహేష్ కోనేరు నిర్మించిన చిత్రమే. ఈ చిత్రం ఈ రోజు విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈచిత్రం మంచి లాభాలు రాబట్టుకుంటుందని ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.

Kalyan Ram Follows His Brother Tarak Advise:

Kalyan Ram Doing Movies in Other Banners

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ