Advertisementt

నాగశౌర్య, మాళవిక కాంబినేషన్ మరోసారి!

Sat 02nd Mar 2019 10:26 PM
naga shourya,srinivas avasarala,malavika nair,t.g. viswa prasad,new film  నాగశౌర్య, మాళవిక కాంబినేషన్ మరోసారి!
Again Movie in Naga Shourya and Malavika Combo నాగశౌర్య, మాళవిక కాంబినేషన్ మరోసారి!
Advertisement
Ads by CJ

నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా  శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 

విజయవంతమైన చిత్రాలలోని నాయకా, నాయికలు అలాగే దర్శకులు... వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది. 

ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనిని, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది.

వివరాల్లోకి వెళితే...

ఆమధ్య యువ కథానాయకుడు నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగసౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద’ చిత్రాల విజయాలు తెలిసిందే. 

ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగసౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక, నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు. 

Again Movie in Naga Shourya and Malavika Combo:

Naga Shourya, Srinivas Avasarala, T.G. Viswa Prasad New Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ