తమిళనాట అజిత్ - దర్శకుడు శివ కాంబో అంటే క్రేజీ కాంబో. వారి కాంబోలో తెరకెక్కిన చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా... భారీ వసూళ్లు సాధించగల సత్తా ఆ కాంబోకి ఉంది. అందుకేనేమో అజిత్ ఎక్కువగా శివ కే ప్రయారిటీ ఇస్తాడు. వీరి కాంబోలో తమిళనాట పొంగల్ కి విడుదలైన విశ్వాసం సినిమాకి డివైడ్ టాకొచ్చినా కోట్లు కొల్లగొట్టింది. అజిత్ క్రేజ్ తోనే సినిమాలు ఆడేస్తాయనడానికి ఈ సినిమా కలెక్షన్స్ ఉదాహరణే. ఇక తమిళనాట విడుదలైన 50 రోజులకు, అలాగే అమెజాన్ ప్రైమ్ లో కూడా వచ్చేసిన విశ్వాసం సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి వదిలారు. అక్కడ విడుదలైన 50 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలైంది.
కోలీవుడ్ లోనే డివైడ్ టాకొచ్చిన ఈ సినిమాని తెలుగు నిర్మాతలు కేవలం మూడు కోట్లకు కొన్నారు. కానీ నిన్న ఇక్కడ విడుదలైన విశ్వాసం టాక్ చూస్తే ఆ మూడు కోట్లు కూడా రావనిపిస్తుంది. రొటీన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన విశ్వాసం సినిమాకి తెలుగులో విడుదలైన మొదటి షోకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. పల్లెటూరి పెద్దగా అజిత్... కొంతమంది వద్దని అడ్డుపడినా.. ఆ ఊరి జాతరను ఘనంగా జరిపించడం.. అందరూ ఆనందంగా ఉంటే... తాను మాత్రం భార్యకి దూరమై బాధపడతాడు. అది చూసిన బంధువులు భార్యని తీసుకురమ్మని చెబుతారు. అలిగి వెళ్లిన భార్యని తీసుకురావడానికి వెళ్లిన అజిత్ కి తన కూతుర్ని ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. అందుకు అజిత్ అడ్డుపడడం వంటి రొటీన్ స్టోరీతో తెరకెక్కిన విశ్వాసం సినిమాని తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు.
ప్రభాస్ మిర్చి సినిమా కాన్సెప్ట్ మాదిరిగా విశ్వాసం సినిమా అనిపిస్తుంది. ఒక బిడ్డ పుట్టాక భార్య భర్తలు విడిపోవడం.. తర్వాత కలవడం వంటి కథ మనకి మిర్చి సినిమాలో ప్రభాస్ ని తీసుకుని నదియా, సత్య రాజ్ విడిపోతారు. ఇక్కడ అజిత్, నయనతార బిడ్డ పుట్టాక విడిపోతారు. ఇక అజిత్ నటన అదుర్స్ అనిపించినా... నయనతార, అజిత్ కాంబో సీన్స్ బావున్నా... అజిత్ తన కూతురు మధ్య సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ... వర్కౌట్ కానీ కామెడీ సన్నివేశాలతో దర్శకుడు శివ కథనాన్ని నెమ్మదిగా నడిపి బోర్ కొట్టించాడు. అందుకే విశ్వాసం సినిమాకి నెగెటివ్ టాకే పడింది. మరి తమిళనాట నెగెటివ్ టాక్ తో కొల్లగొట్టిన ఈ సినిమా తెలుగులో జస్ట్ ఓకే కలెక్షన్స్ కూడా వచ్చేలా కనబడ్డం లేదు.