మహా శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రవితేజ, విఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ ‘డిస్కోరాజా’
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ చిత్రం ప్రారంభోత్సవం మహా శివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగింది. నిర్మాత రజని తాళ్ళూరి క్లాప్ కొట్టగా... రామ్ తాళ్ళూరి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ‘నన్నుదోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి... రవితేజతో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘‘ముందుగా తెలుగు ప్రేక్షకులందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు. నేల టిక్కెట్ తర్వాత మాస్ మహారాజా రవితేజగారితో మేం నిర్మిస్తున్న డిస్కో రాజా చిత్రాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టాం. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నాం. పాయల్ రాజపుత్, నభా నటేష్ హీరోయిన్లు. దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. మా బ్యానర్ విలువను రెట్టింపు చేసే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. పేరుకు తగ్గట్టే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. టాప్ టెక్నిషీయన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు..’’ అని అన్నారు.
నటీనటులు
రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ తళ్లూరి
దర్శకుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థమన్
ఎడిటర్ : నవీన్ నూలి
పీఆర్ఓ : ఏలూరు శ్రీను