టాలీవుడ్‌లో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా చేయడం వెనుక పెద్ద మామయ్య చిరంజీవి కంటే చిన్నమామయ్య పవన్‌కళ్యాణ్ కృషే ఎక్కువగా ఉందని అంటారు. తేజు మొదటి చిత్రాన్ని ‘దేవదాసు’ వంటి చిత్రం ద్వారా రామ్‌కి హిట్టిచ్చిన వైవిఎస్ చౌదరి చేతిలో పెట్టి సినిమాకి ఆర్ధిక సాయం కూడా పవనే అందించాడని అంటారు. కానీ రేయ్ చిత్రం విడుదలలో జాప్యం చేసుకుని చివరకు ఆయన రెండో చిత్రంగా విడుదలైంది. ఆ తర్వాత తేజు సరిగ్గా దిల్‌రాజు వంటి నిర్మాత చేతిలో పడ్డాడు. దాంతో వరుసగా పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి చిత్రాలతో జోరు చూపించాడు. కానీ ఆ తర్వాత ఆయన కెరీర్ వరుసగా ఆరు డిజాస్టర్స్‌తో పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు.
తాజాగా ఆయన మైత్రి మూవీమేకర్స్ వంటి వారి చేతిలో పడ్డాడు. సాయిధరమ్‌తేజ్, కళ్యాణిప్రియదర్శిని, నివేదా పేతురాజ్‌లు నటిస్తున్న ‘చిత్రలహరి’ ఏప్రిల్ 12న విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో నిరుద్యోగిగా, రెండు సార్లు ప్రేమలో విఫలమైన యువకునిగా తేజు నటిస్తున్నాడని, హీరోయిన్ల పేర్లే ‘చిత్ర’, ‘లహరి’ అని తెలుస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రం కోసం ఓ యాంటీ క్లైమాక్స్‌ని రూపొందించి, మైత్రి మూవీ మేకర్స్ వారిని ఒప్పించాడట.
కానీ మధ్యలో చిరు ఎంటరై యాంటీ క్లైమాక్స్ అంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉండరని, కాబట్ది కథను సుఖాంతం చేయమని చిరు సలహా ఇవ్వడంతో ఈ చిత్రంలో ఆ మార్పు చేస్తున్నారని సమాచారం. మరి చిరు తుది నిర్ణయం తేజుకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాలి. మరోవైపు తేజు తదుపరి చిత్రాన్ని చేయమని చిరు అల్లు అరవింద్‌కి సూచించాడట. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని సమాచారం.