Advertisementt

‘సైరా’.. రామ్ చరణ్ షాకిస్తున్నాడుగా?

Wed 06th Mar 2019 10:56 PM
chiranjeevi,ram charan,quotes,sye raa movie,overseas rights  ‘సైరా’.. రామ్ చరణ్ షాకిస్తున్నాడుగా?
Sye Raa Movie Overseas Rights Details ‘సైరా’.. రామ్ చరణ్ షాకిస్తున్నాడుగా?
Advertisement
Ads by CJ

సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు చూసే రోజులు ఇవి. కొన్ని సార్లు సినిమాలు మంచి కంటెంట్ ఉన్న కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చిన రోజులు ఉన్నాయి.  సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టమని డిస్ట్రిబ్యూటర్స్ పై ఆ భారం వేస్తే ఎలా? ఇప్పుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా చిత్రం పరిస్థితి అంతే ఉంది.

ఈ సినిమాకు రెండు వందల కోట్ల పైచిలుకు బడ్జెట్‌ అయిందని టాక్ ఉంది. అందుకే రామ్ చరణ్ భారీ రేట్‌ కోట్‌ చేస్తున్నాడట. అమెరికా రైట్స్ నాలుగు మిలియన్‌ డాలర్లు అయితే ఇస్తాం అని చెబుతున్నారట మేకర్స్. నాలుగు మిలియన్‌ డాలర్స్ షేర్ రావాలంటే కనీసం ఎనిమిది మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూళ్లు రావాలి.

మరి ఇప్పుడున్న పరిస్థితిల్లో అది కష్టం. బాహుబలి చిత్రంకి తప్ప మరే చిత్రంకి అంత వసూల్ రాలేదు. ఇక చిరు నటించిన ఖైదీ నంబర్‌ 150కి రెండున్నర మిలియన్ల కంటే తక్కువ గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. బాహుబలి చిత్రంకి వచ్చిన టాక్ సైరాకి కూడా వస్తే అంత పాజిబుల్ అవుతుంది. ఎనిమిది మిలియన్‌ డాలర్లు అనేది చాలా పెద్ద టార్గెట్‌. మరి జనాలు ఎంతవరకు ఈ సినిమా ఆదరిస్తారో చూడాలి. అసలు ఈ సినిమాను అంత రేట్ పెట్టి అక్కడ కొంటారా లేదా చూడాలి.

Sye Raa Movie Overseas Rights Details:

Ram Charan Quotes Shocking Price to Sye Raa Overseas Rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ