Advertisementt

అనసూయ కథనంకు మెగా సపోర్ట్

Sun 10th Mar 2019 12:02 AM
anasuya,kathanam,teaser,upasana,launches  అనసూయ కథనంకు మెగా సపోర్ట్
Upasana Launches kathanam teaser అనసూయ కథనంకు మెగా సపోర్ట్
Advertisement
Ads by CJ

మహిళా దినోత్సవం సందర్బంగా క‌థ‌నం టీజర్ ని విడుదల చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన..!!

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’..  ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ పతాకాలపై  బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శ‌ర్మ‌చుక్కా  సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్‌ సంగీతం సమకూరుస్తుండగా, స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు..  అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకోగా, నేడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రబృందం.. ఈ టీజర్ ని మెగా పవర్ స్టార్ సతీమణి కొణిదెల ఉపాసన విడుదల చేయడం విశేషం..  

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత న‌రేంద్ర రెడ్డి మాట్లాడుతూ...  క‌థ న‌చ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అన‌సూయ‌గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆవిడ కేరీర్ లో ఇదొక  బ్లాక్ బ‌స్ట‌ర్  అవుతుంద‌ని  న‌మ్మ‌కం ఉంది. మహిళా దినోత్సవం సందర్బంగా టీజర్ ని రిలీజ్ చేశాము.. టీజర్ అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.. ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న ఉపాసన కొణిదెల గారికి కృతజ్ఞతలు.. అన్నారు.. 

దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ఇది నా మొద‌టి చిత్రం.. క్ష‌ణం, రంగ‌స్థ‌లం తర్వాత ఆమె చేస్తున్న ఈ క‌థ‌నం సినిమాతో హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు అన‌సూయ‌గారు. తప్పకుండా ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది..  ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. న‌రేంద్ర‌రెడ్డిగారు పంపిణిదారునిగా  ఏ సినిమా చేసినా హిట్.. ఆయ‌న‌ది ల‌క్కీ హ్యాండ్. ఏ సినిమా చేసినా హిట్ అయ్యాయి. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉంది.. .. ఇక ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేసిన ఉపాసన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.. సినిమా ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికి చాల థాంక్స్ అన్నారు.. 

ఇంకా ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్: సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్: కె.వి.ర‌మ‌ణ‌,  రచయిత: రాజేంద్ర భరద్వాజ్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లు: బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం: రాజేష్ నాదెండ్ల‌

Click Here For Teaser:

Upasana Launches kathanam teaser:

Kathanam Movie Teaser Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ