తెలుగులో వామపక్షాలకు ‘విశాలాంద్ర, ప్రజాశక్తి’ వంటి పత్రికలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ రంగ ప్రవేశం తర్వాత రామోజీరావు మీడియా మొత్తం ఎన్టీఆర్‌కి అనుకూలంగానే నడించింది. తాను కాంగ్రెస్ వ్యతిరేకిని అని, తాను ఎన్టీఆర్‌కి అందుకే మద్దతు ఇస్తున్నానని నాడు రామోజీరావు స్వయంగా ప్రకటించాడు. కానీ మీడియా విస్తరిస్తూ పోవడం, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌మీడియా రంగ ప్రవేశం తర్వాత పార్టీకో చానెల్, పత్రిక, వెబ్‌సైట్స్, యూట్యూబ్స్ వస్తున్నాయి. ఇక మీడియా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నా కూడా నాడు ఈనాడు మినహా మిగిలినవన్నీ లోపాయికారీ మద్దతు ఇచ్చేవే గానీ బయటపడేవి కావు. కానీ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఈ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై మండిపడే వాడు. ఆ నేపధ్యంలోనే తన కుమారుడి చేత సాక్షి పత్రిక, చానెల్స్‌ని పెట్టించాడు.
మరోవైపు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలపై నిషేధం విధించాడు. ఇక ప్రస్తుతం ఉన్న పలు చానెల్స్‌లో జగన్‌కి లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని, ఆయా చానెల్స్‌లో వాటాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ దశలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సైతం సాక్షి విలేకరిపై మండిపడ్డాడు. మీడియా సమావేశంలో సాక్షి విలేకరి బాబును ఓ ప్రశ్న వేయగా, సాక్షి పత్రికకు ఇక్కడ ప్రశ్నించే అర్హత లేదు. ఆ పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కావాలని ఓ పత్రిక పెట్టుకున్న ఓ పార్టీ అధ్యక్షుడు, ఆయనకు మౌత్‌పీస్ వంటి విలేకరికి సమాధానం చెప్పను అని సమాధానం ఇచ్చాడు. ఇక గతంలో ఎన్‌టీవీలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావుపై కూడా చంద్రబాబు మండిపడి ఉద్యోగం ఊడగొట్టాడని అంటారు.
ఇక ఈ విషయంలో వైసీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆ మధ్యదాకా జగన్‌కి మీడియా అంటే కేవలం జాతీయ మీడియానే అనే భావన ఉండేది. తెలుగు మీడియాతో ఆయన మాట్లాడే వాడు కాదు. ఇప్పటికే టిడిపికి అనుకూలంగా ఉందని ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలు తమ కార్యక్రమాలకు హాజరు కానవసరం లేదని, వారు నిర్వహించే చర్చాగోష్టులకు తమ నాయకులు హాజరుకారాదని జగన్‌నిర్ణయం తీసుకున్నాడు.
తాజాగా ఆయన చూపు టివి5పై పడింది. టివి5 కూడా కేవలం చంద్రబాబుకి మౌత్‌పీస్‌గా ఉందని, టిడిపికి అనుకూలంగా కార్యక్రమాలు, చర్చాగోష్టులు నిర్వహిస్తోందని భావించిన ఆయన టివి5కి కూడా తమ పార్టీ తరపు కార్యక్రమాలకు ఎవ్వరూ హాజరుకారాదని హుకుం జారీచేశాడు.