బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌కుమార్ ఇటీవల ముంబైలో అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఒంటికి నిప్పంటించుకుని నడుచుకుంటూ వస్తూ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. మంటల్లో అక్షయ్ ని చూసిన వారంతా ఏంటీ ఇలా చేస్తున్నాడని అంతా షాక్‌కు గురయ్యారు. ఇక అక్షయ్ వైఫ్, ట్వింకిల్ ఖన్నా బ్రతికుంటే ఇంటికి రా నేనే కాల్చేస్తా అంటూ కలరింగ్ ఇచ్చేసింది. అయితే అక్షయ్ ఒంటిపై నిప్పంటించుకుని స్టేజ్‌పై హల్ చల్ చేయడానికి వెనుక పెద్ద స్టోరీనే వుందని తెలిసింది.
తన కొడుకు కారణంగా వెబ్ సిరీస్ దునియాలోకి ఎంటరవుతున్నానని చెప్పిన అక్షయ్ కుమార్ త్వరలో అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ` ది ఎండ్` థ్రిల్లర్ సిరీస్‌లో నటించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. మిగతా క్రూ ఎవరనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఈ వెబ్ సిరీస్ కోసం ఖిలాడీ అక్షయ్ మాత్రం భారీ డీల్ కుదుర్చుకున్నాడని తెలిసింది. అక్షయ్‌కుమార్, అమెజాన్ ప్రైమ్ మధ్య దాదాపు 90 కోట్ల డీల్ జరిగినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అక్షయ్ తరువాత అమెజాన్ ప్రైమ్ కన్ను సల్మాన్‌ఖాన్‌పై పడింది. అక్షయ్‌తో థ్రిల్లర్ సిరీస్ పూర్తి కాగానే సల్మాన్‌ను రంగంలోకి దించాలని ప్లాన్ మొదలుపెట్టారు. అక్షయ్ తరహాలోనే సల్మాన్‌ఖాన్ కూడా అమెజాన్ ప్రైమ్ కు లొంగిపోతాడో లేక సినిమాలే నా ప్రపంచం అని తిరస్కరిస్తాడో చూడాలి.