Advertisementt

‘వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద’ వచ్చేందుకు డేట్ ఫిక్స్

Sun 10th Mar 2019 08:08 PM
vajra kavachadhara govindha,saptagiri,arun pawar,release date,ugadi  ‘వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద’ వచ్చేందుకు డేట్ ఫిక్స్
VKG Movie Release Date Fixed ‘వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద’ వచ్చేందుకు డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

ఉగాది కానుకగా ఏప్రిల్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సప్తగిరి  చిత్రం  ‘VKG’ (వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌)  

స్టార్ కమెడియన్ కమ్ హీరో సప్తగిరి నటిస్తున్న ‘VKG’ (వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌)  షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరోసారి విభిన్నమైన పాత్రలో సప్తగిరి కనిపించే ఈ చిత్రానికి అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కుడు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇటీవల మైసూరు, తదితర ప్రాంతాల్లో ఆఖరి షెడ్యూల్ చిత్రీకరించారు. 

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ.. ‘‘హీరో స‌ప్త‌గిరి నుంచి ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో, అలాంటి అంశాల‌న్నీ మా సినిమాలో ఉంటాయి. సప్తగిరి బాడీలాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. స్టోరి డిమాండ్ మేరకే ప‌వ‌ర్‌ఫుల్‌గా ‘VKG’ (వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌) అనే టైటిల్‌ పెట్టాం. ఫ‌న్నీ దొంగ‌కు, ‘వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌’ టైటిల్‌కు సంబంధమేమిటనే అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. ‘VKG’ (వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌) టైటిల్ పెట్టగానే మాకు ఇండస్ట్రీ పెద్దల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం మా విశ్వాసాన్ని మరింత పెంచింది. కథ, కథనాల్లో ఉండే పవర్‌కు తగినట్టుగానే మా నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను ఆకర్షణీయంగా రూపొందించే బాధ్యతను మాపై ఉంచారు’’ అని అన్నారు. 

నిర్మాత‌లు నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా హీరో స‌ప్త‌గిరితో మా ద‌ర్శ‌కుడు అరుణ్‌ప‌వార్‌ తెర‌కెక్కించిన ‘స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్’ సినిమా ఎంతటి సక్సెస్‌ను సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి ఏమాత్రం త‌గ్గ‌కుండా మా ‘VKG’ (వ‌జ్ర‌క‌వ‌చధ‌ర గోవింద‌) ఉంటుంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. హైదరాబాద్, మైసూర్, మెల్కోటే, కూర్గ్  పరిసర ప్రాంతాల్లోని అందమైన ప్రదేశాల్లో  ‘వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’ చిత్రాన్ని తెర‌కెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. 

నటీనటులు: వైభవీ జోషీ, అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు 

కథ: జి టి ఆర్ మహేంద్ర, 

సంగీతం: విజయ్ బుల్గానిన్, 

కెమెరా: ప్రవీణ్ వనమాలి, 

ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు, 

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అరుణ్ పవార్.  

VKG Movie Release Date Fixed:

Vajra Kavachadhara Govindha Movie Release on April 06

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ