Advertisementt

‘దిక్సూచి’ ట్రైలర్: అద్భుతం అనేలా ఉంది

Sun 10th Mar 2019 08:17 PM
diksoochi,diksoochi trailer release,dileep kumar salwadi,kranthi madhav,dikshoochi movie  ‘దిక్సూచి’ ట్రైలర్: అద్భుతం అనేలా ఉంది
Diksoochi Trailer Released ‘దిక్సూచి’ ట్రైలర్: అద్భుతం అనేలా ఉంది
Advertisement
Ads by CJ

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ..‌ ‘‘దిలీప్ ఈ చిత్రాన్ని అన్నీ తానే అద్భుతంగా తీశాడు. తనకు అన్నీ క్రాప్ట్స్ మీద అవగాహన ఉంది. నిర్మాత రాజుగారి ఎంకరేజ్‌మెంట్‌తో తాను పర్ఫెక్ట్ మూవీ చేశాడనిపించింది.‌ కళ అంటే గౌరవం ఉంటేనే ఈ తరహా సినిమాలు వస్తాయి. సినిమానే ప్రాణంగా చేశారు. ట్రైలర్‌లో అది కన్పించింది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

సుధాకర్ మాట్లాడుతూ.. నిర్మాతకు టేస్ట్ ఉంటేనే ఇలాంటి మంచి సినిమాలు చేయగలరు. ట్రైలర్ చూస్తే అద్భుతం అని అందరూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు‌. ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీ‌తో పాటు, థియేటర్స్ కూడా బాగా దొరకాలి. టీమ్ వర్క్‌ను అందరూ ఎంకరేజ్ చేయాలి. సిజి వర్క్, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా దిలీప్ చేశాడు. తను నటుడుగా, టెక్నిషియన్‌గా మంచి గుర్తింపును సాధించాలన్నారు.

చత్రపతి శేఖర్ మాట్లాడుతూ.. దిలీప్ సినిమా దర్శకుడు అనగానే ఫస్ట్ డౌట్ పడ్డాను.‌ బట్ అతని డిజైనింగ్, ప్రీ ప్లాన్ అంతా సూపర్బ్. సినిమా ఔట్ పుట్ చూస్తే అందరూ స్టన్ అవ్వటం గ్యారెంటీ అన్నారు.

బిత్తిరీ సత్తి మాట్లాడుతూ.. అందరం కష్టపడి పైకి వచ్చిన మనుషులం కలిసి ఈ సినిమా చేశాము. దిలీప్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో.. రిలీజ్‌కు కూడా అదే విధంగా కష్టపడుతున్నాడు. తను సక్సెస్ అవ్వటం మాత్రం పక్కా.‌ తను కూడా 25సం. అనుభవం ఉన్న యాక్టర్. నిర్మాతలు మరిన్ని మంచి చిత్రాలు తీయాలన్నారు.

సమ్మెట గాంథీ మాట్లాడుతూ.. నేను రాజు పాత్రలో నటించాను. దిలీప్ ఆల్ రౌండర్. తాను గొప్ప స్దాయికి ఎదగుతాడన్నారు‌. 

హీరోయిన్ చాందినీ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తే దిలీప్ కష్టం ఎంటనేది తెలుస్తుంది. చిన్నగా ప్రారంభం చేసినా చాలా గ్రాండ్‌గా పూర్తి చేశాము. నాకు అవకాశం రావటం నా అదృష్టమన్నారు.

హీరో క‌మ్ డైరెక్ట‌ర్ దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ.. నిర్మాత  రాజుగారు గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. న‌న్ను న‌మ్మి డ‌బ్బులు పెట్టారు. దిక్సూచి ఓ కొత్త జోనర్‌లో వస్తున్న సినిమా ఇది.‌ ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే చిత్ర‌మిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ. సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. చాలా నీట్‌గా థ్రిల్లింగ్‌, డివోష‌న‌ల్‌ అంశాలతో ఉంటుంది. అందరు నటీనటులు స‌పోర్ట్ చేశారు, అంతే అద్బుతంగా నటించారు. సినిమా బాగుంటే థియేటర్స్ ప్రాబ్లం ఉండదని నేను నమ్ముతాను. 2019లో ది బెస్ట్ మూవీగా దిక్సూచి ఉంటుందని మా టీమ్ కాన్పిడెంట్ గా ఉన్నామన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో సుమన్, అరుణ్ భరత్, నిహారిక తదితరులు పాల్గొన్నారు. 

>Click Here for Trailer

దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి, రాకేష్, మల్లాది భాస్కర్, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం: దిలీప్ కుమార్ స‌ల్వాది, ప్రొడ్యూస‌ర్స్: న‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరా: జ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్: ప‌ద్మనాభ్ భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్: శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్ష‌న్: దిలీప్‌కుమార్ స‌ల్వాది, క‌ట్స్: దిక్సూచి స్టూడియోస్.

Diksoochi Trailer Released:

Diksoochi Movie Trailer Release Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ