Advertisementt

వ‌రుణ్‌తేజ్‌ కోసం సునీల్‌ని విల‌న్‌ని చేస్తున్నారు?

Mon 11th Mar 2019 05:24 PM
varun tej,sunil shetty,kiran korrapati,allu boby,allu arjun brother,  వ‌రుణ్‌తేజ్‌ కోసం సునీల్‌ని విల‌న్‌ని చేస్తున్నారు?
sunil shetty key role in varun tej film వ‌రుణ్‌తేజ్‌ కోసం సునీల్‌ని విల‌న్‌ని చేస్తున్నారు?
Advertisement
Ads by CJ

వ‌రుణ్‌తేజ్‌ కోసం సునీల్‌ని విల‌న్‌ని చేస్తున్నారు. సునీల్ అంటే మ‌న సునీల్ కాదులెండి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టీని. నైన్టీస్‌లో ధ‌డ్క‌న్‌, దిల్ వాలే, మెహ్రా, భాయ్ వంటి హిట్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న సునీల్‌షెట్టిని టాలీవుడ్‌కు తీసుకురాబోతున్నారు. `బాహుబ‌లి` పుణ్య‌మాఅని తెలుగు సినిమా అంటే దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. తెలుగు సినిమా వంక చూడ‌ని వాళ్లు కూడా ఇక్క‌డి నుంచి సినిమా రాబోతోందంటే అమితాస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. హీలీవుడ్ న‌టులు సైతం ఒక్క తెలుగు సినిమాలో అయినా క‌నిపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. 

ఇక‌ బాలీవుడ్ స్టార్‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌న ద‌గ్గ‌ర ఏదైనా స్టార్ హీరో సినిమా మొద‌ల‌వుతోందంటే అందులో ఏదైనా కీ రోల్ దొరుకుతుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వ‌రుణ్‌తేజ్ న‌టించ‌బోతున్న సినిమా కోసం సునీల్‌శెట్టిని విల‌న్ పాత్ర కోసం చిత్ర బృందం సంప్ర‌దించార‌ట‌. ఎదురుచూస్తున్నఅవ‌కాశం త‌లుపుత‌ట్ట‌డంతో సునీల్‌శెట్టి ఎగిరి గంతేశాడ‌ని తెలిసింది. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొంద‌నున్నఈ సినిమా ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. అల్లు అర్జున్ అన్న‌య్య అల్లు బాబి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. 

వ‌రుణ్‌తేజ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇందు కోసం ఒలింపిక్ విన్న‌ర్ టోనీ జెఫ్రిస్ వ‌ద్ద బాక్సింగ్ లో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన బాక్సింగ్ నేప‌థ్య చిత్రాల్లో కొత్త పంథాలో ఈ సినిమాను రూపొందించ‌డానికి కిర‌ణ్ కొర్ర‌పాటి ప్లాన్ చేస్తున్నాడు. త‌న‌కిది ద‌ర్శ‌కుడిగా తొలి సినిమా కావ‌డంతో ప్ర‌తి విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్తులు తీసుకుంటున్నాడు. తొలి సినిమా ద్వారానే త‌న మార్కును చూపించి బ్లాక్  బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవాల‌న్న‌ది కిర‌ణ్ ఆలోచ‌న‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే అడుగులు వేస్తూ ఈ చిత్రాన్ని క్రేజీ ప్రాజెక్టుగా మ‌లుస్తున్నాడు. 

sunil shetty key role in varun tej film:

sunil shetty as villain in varun tej film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ