Advertisementt

మార్చి 15న ఎలా ప్రపోజ్ చేయాలో తెలుస్తుంది

Tue 12th Mar 2019 11:21 PM
mouname ishtam movie,release details,mouname ishtam,ashok kumar,press meet  మార్చి 15న ఎలా ప్రపోజ్ చేయాలో తెలుస్తుంది
Mouname Ishtam Movie Release Press Meet మార్చి 15న ఎలా ప్రపోజ్ చేయాలో తెలుస్తుంది
Advertisement
Ads by CJ

ఆర్ట్ డైరెక్టర్‌గా దాదాపు 150 సినిమాలకు పైగా వర్క్ చేసి 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న ప్రముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఏకే మూవీస్ ప‌తాకంపై ఆశా అశోక్ నిర్మించిన చిత్రం ‘మౌన‌మే ఇష్టం’. రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ  చిత్రానికి వివేక్ మహదేవా సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్ తో ట్రేడింగ్ లో ఉంది. మార్చి 15 న ఈ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా దర్శకుడు అశోక్ కుమార్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది అలాంటి ప్రేమికుడి ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఏంటో అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. నాకుఇలాంటి ఒక మంచి ప్రాజెక్టు లో అవకాశం ఇచ్చినందుకు అశోక్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషం. అలాగే రామ్ తులసి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సురేష్ గారు మంచి డైలాగ్స్ అందించారు. వివేక్ గారు ఇచ్చిన సంగీతాన్ని ఇప్పటికే ప్రతి ఒక్కరు అభినందించారు. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి’’ అన్నారు.

హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు అశోక్ గారు ఈ సినిమాను వండర్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందించారు. రామ్ తులసి గారు ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తిక్ కి ఈ సినిమా ద్వారా నటుడిగా మంచి పేరు వస్తుంది’’ అన్నారు.

డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మంచి స్టోరీ దొరికితే దర్శకత్వం వహిద్దామని నేను దాదాపు 15 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్యూట్ జెండర్ లవ్ స్టొరీ. ఎలా ప్రపోజ్ చేయాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ప్రతి టెక్నిషియన్ అద్భుతమైన పని తనం కనబరిచారు. సినిమా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఆడిషన్స్ చేసి కార్తీక్‌ని హీరోగా తీసుకోవడం జరిగింది. పార్వతీ మంచి పెరఫార్మర్. రీతూ క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా మార్చ్ 15న విడుదలవుతుంది.. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు.

కథా రచయిత సురేష్ మాట్లాడుతూ.. ‘‘ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు ప్రపోజ్ చేసుకుంటే వారు విడిపోవాల్సిన సందర్భం ఏర్పడితే వారి పరిస్థితి ఏంటి అనే అద్భుతమైన కథాంశం‌తో ఈ సినిమా రూపొందింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి నా ధన్యవాదాలు’’ అన్నారు.

నటి ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘నటనలో ఎలాంటి అనుభవం లేని నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అశోక్ గారికి థాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా తప్పక చూడండి’’ అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ నాయర్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రామ్ తులసి మాట్లాడుతూ.. ‘‘అశోక్ గారు నాకు చాలా చక్కటి సహకారాన్ని అందించారు. ప్రతి ఆర్టిస్ట్ చాలా అనుభవం ఉన్న నటుడిలా నటించారు. సినిమా చాలా బాగుంది. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు.

Mouname Ishtam Movie Release Press Meet:

Mouname Ishtam Movie Ready to Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ