Advertisementt

‘హ‌ల్‌చ‌ల్‌’ చేసేందుకు వస్తున్నారు

Wed 13th Mar 2019 01:19 PM
rudraksh,dhanya balakrishna,hulchal movie,censor,updates  ‘హ‌ల్‌చ‌ల్‌’ చేసేందుకు వస్తున్నారు
Hulchal Movie Latest Update ‘హ‌ల్‌చ‌ల్‌’ చేసేందుకు వస్తున్నారు
Advertisement
Ads by CJ

శ్రీ రాఘ‌వేంద్ర ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై రుద్రాక్ష్‌, ధ‌న్య బాల‌కృష్ణ న‌టీనటులుగా తెర‌కెక్కిన చిత్రం ‘హ‌ల్‌చ‌ల్‌’. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి  చేసుకుని సెన్సార్‌కి సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత గ‌ణేష్ కొల్లురి మాట్లాడుతూ -  ‘‘క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో తెర‌కెక్కుతున్న మా ‘హ‌ల్‌చ‌ల్‌’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా తీర్చిదిద్దాం. సినిమా సెన్సార్‌కి సిద్ధ‌మైంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. రుద్రాక్ష్‌, ధన్య బాల‌కృష్ణ చ‌క్క‌గా యాక్ట్ చేశారు. మా బ్యాన‌ర్‌కు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంద‌నే న‌మ్మ‌కముంది. మంచి టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. ద‌ర్శ‌కుడు శ్రీపతి అనుకున్న ప్లానింగ్‌, బ‌డ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాడు.  హ‌నుమాన్‌, భ‌ర‌త్ సంగీతం అందించిన ఈ సినిమాకి రాజ్‌తోట కెమెరా వ‌ర్క్ అందించారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేశారు. ఈ స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు  చేస్తున్నాం’’ అన్నారు. 

రుద్రాక్ష్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, కృష్ణుడు, మ‌ధునంద‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈచిత్రానికి సంగీతం:  హ‌నుమాన్‌, భ‌ర‌త్‌, కెమెరా:  రాజ్‌తోట‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌:  ఆర్‌.కె.రెడ్డి, నిర్మాత‌: గ‌ణేష్ కొల్లురి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీప‌తి క‌ర్రి.

Hulchal Movie Latest Update:

Hulchal in Censor Stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ