మాస్ మహారాజా రవితేజ వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రవితేజ వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చిత్రం మొదలు పెట్టాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఎప్పటినుండో రవితేజ తమిళ్ ‘థేరి’ రీమేక్‌లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిచంద్, సివి మోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కేథరిన్ తెరిస్సా ను ఒకే చేసారని తెలుస్తోంది.