పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత అక్కినేని జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఏ ప్రిల్ 5నసినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.
వైజాగ్ నేపథ్యంలో తెరకెక్కిన మజిలీ ఓ ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. కోటి మంది ఈ డిజిటల్ వ్యూవర్స్ తో టీజర్ ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతాన్ని అందించారు.
నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: వంశీ-శేఖర్, యాక్షన్: వెంకట్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: సాహి సురేష్, సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, సంగీతం: గోపీసుందర్, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.