తెలుగు జాతి గర్వించదగ్గ పోరాట యోధులు అల్లూరి సీతారారాజు, కొమరం భీం. ఈ ఇద్దరి జీవితాల్లో తెలియని కథని ఫిక్షన్‌గా `ఆర్ ఆర్ ఆర్`లో తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ససినిమా ప్రారంభానికి ముందు కథేంటో? తను ఏం తీయబోతున్నాడో ముందే క్లిస్టర్ క్లియర్‌గా రాజమౌళి చెప్పేశాడు. దీంతో ఈ సినిమా కథ విషయంలో ఎలాంటి బుర్రకథలు, పిట్టకథలు పుట్టుకురావాల్సిన, పుట్టుకొచ్చే అవసరం, అవకాశం లేకుండా పోయింది. `బాహుబలి` వంటి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా చర్చమొదలైంది. ఆ చర్చకు తగ్గట్లే ఈ చిత్ర పారితోషికాలు కళ్లుబైర్లు కమ్మేలా వున్నాయి.
400 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా గ్రాండీయర్‌గా తెరపైకి రాబోతున్న ఈ సినిమా రెమ్మునరేషన్‌ల విషయంలోనూ సంచలనం సృష్టించబోతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక మొత్తంలో పారితోషికాల్ని అందించిన సినిమాగా కూడా `ఆర్ ఆర్ ఆర్` చరిత్ర సృష్టించబోతోంది. సినిమా కోసం 400 కోట్లు ఖర్చుచేస్తున్న దానయ్య పారితోషికాల కోసం ఏకంగా 150 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళికి ఈ సినిమా పారితోషికం కింద 50 కోట్లతో పాటు వచ్చిన లాభాల్లో వాటా దక్కనుందట.
ఇక హీరోల్లో ఎన్టీఆర్‌కు 30 నుంచి 40 వరకు దక్కే అవకాశం వుందని తెలిసింది. ఇది వరకు ఎన్టీఆర్ ఒక సినిమాకు 17 నుంచి 20 వరకు తీసుకునేవాడు. అయితే ఈ చిత్రానికి గాను 30కి మించి పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. రామ్‌చరణ్ కు కూడా భారీగానే అందజేస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా 14 నుంచి 16 వరకు తీసుకునే రామ్‌చరణ్ కూడా ఈ సినిమాకు 30 డిమాండ్ చేసినట్లు చిత్ర బృందం సమాచారం. ఇక కీలక పాత్రలో 30 నిమిషాల పాటు కనిపించే అజయ్ దేవగన్ 10 నుంచి 15 కోట్టిస్తున్నట్టు వినికిడి. తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్న అలియాభట్ 12 కోట్లే, డైసీ ఎడ్గార్జోన్స్ 5 కోట్లు, విజయేంద్రప్రసాద్, కీరవాణితో సహా టెక్నీషియన్‌లకు 15 వరకు అందే అవకాశం వుందని విశ్వసనీయ సమాచారం. పారితోషికాలే ఈ రేంజిలో వుంటే ఈ సినిమా సాధించబోయే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏ స్థాయిలో వుంటాయో ఊహించుకోవచ్చు.