Advertisementt

‘డియర్ కామ్రేడ్’ టీజర్ వదిలారు

Sun 17th Mar 2019 10:34 PM
vijay deverakonda,rashmika mandanna,teaser,dear comrade  ‘డియర్ కామ్రేడ్’ టీజర్ వదిలారు
Dear Comrade Teaser Released ‘డియర్ కామ్రేడ్’ టీజర్ వదిలారు
Advertisement
Ads by CJ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ టీజర్ విడుదల... మే 31న సినిమా విడుదల 

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్  బెన్  సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందుతుంది.

ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో టీజర్ ను విడుదల చేశారు. టీజర్‌లో స్టూడెంట్ నాయకుడిగా విజయ్ దేవరకొండ చేసే ఫైట్స్... రష్మిక తో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు నేచురల్‌గా ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీత సారధ్యంలో ప్రముఖ గాయకుడు సిద్  శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌ పెంచింది.  ప్రస్తుతం హైదరాబాదులో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 31న గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ రష్మిక తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, నిర్మాతలు : నవీన్ ఎర్నేని,య‌ల‌మంచిలి రవి శంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని, సి.ఈ.ఒ :చెర్రీ,  సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్, ఆర్ట్:  రామాంజనేయులు, డైలాగ్స్:  జె కృష్ణ, లైన్ ప్రొడ్యూసర్: కెవీఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ ఎర్నేని, పి ఆర్ ఓ: వంశీ శేఖర్.

Click Here for Teaser

Dear Comrade Teaser Released:

Vijay Devarakonda and Rashmika starring Dear Comrade Teaser 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ