ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే.. అది రాజమౌళి RRR గురించే. సినిమా అనౌన్సమెంట్ వచ్చినప్పటి నుండి.. ఇప్పటివరకు అదే క్రేజ్... ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ ఉంది. కారణం టాప్ స్టార్ హీరోస్ కలిసి నటించడమే. RRR పై ఏ చిన్న అప్ డేట్ బయటికొచ్చినా.. అదే పనిగా హాట్ టాపిక్ అవుతుంది. మొన్నటికి మొన్న RRR సినిమా ప్రెస్ మీట్ బోలెడన్ని విషయాలను రాజమౌళి చెప్పేసాడు. బహు భారీ ప్రాజెక్ట్ గా RRR తెరకెక్కుతోందని.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారని. హీరోయిన్సగా చరణ్ కి అలియా భట్, ఎన్టీఆర్ కి హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తారని, ఇంకా అజయ్ దేవగన్, సముద్ర ఖని కీలకపాత్రలు చేస్తున్నారని.. అలాగే RRR కథపై కూడా క్లారిటీ ఇచ్చిన రాజమౌళి RRR గురించి అబ్బో చాలా విషయాలే రివీల్ చేసాడు.
ఇక రామ్ చరణ్ కి బాలీవుడ్ హీరోయిన్ ని దింపిన రాజమౌళి బృందం ఆమె కోసం భారీ పారితోషకం సమర్పించుకుంటున్నారని.. అలియా క్రేజ్, డిమాండ్ ని బట్టి ఆమెకి 10 నుండి 12 కోట్ల వరకు ఇచ్చుకుంటున్నారనే న్యూస్ నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఆ రేంజ్ పారితోషకాలు కామనే... అందులోను అలియా సూపర్ హిట్స్ తో భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉందాయె. మరి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కే RRR టీం అంత సమర్పిస్తే... ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ కి ఎంత సమర్పించాల్సి వస్తుందో... ? అనేది ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో నడుస్తున్న హాట్ టాపిక్.
అయితే ఈ హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో నటించలేదు కానీ... గత ఏడాది ఒకే ఒక్క సినిమా పాండ్ లైఫ్ లో నటించింది. మరి సినిమాల్లో పెద్దగా పాపులర్ కానీ ఈ డైసీ ఎడ్గార్ జోన్స్ టీవీ సిరీస్‌లతో పేరు సంపాదించింది. కోల్డ్ ఫీట్, వార్ ఆఫ్ ది వరల్డ్స్, జెంటిల్‌మాన్ జాక్ లాంటి టివి సీరీస్ తో డైసీ ఎడ్గార్ జోన్స్ బాగా పాపులర్ అయ్యింది. మరి ఎక్కువ సినిమాలు చేయకుండా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించిన ఈ చిన్నది ఇప్పుడు రాజమౌళి RRR లో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. మరి ఈ హీరోయిన్ డైసీకి RRR టీం ఎంత పారితోషకం ఇస్తుందో అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు, మీడియా మిత్రుల ముందున్న టాపిక్.