Advertisementt

డ్యామేజ్ కాకూడదనే బాలయ్యని సైలెంట్ చేశారా?

Wed 20th Mar 2019 03:48 PM
balakrishna,hindupur,candidate,silence  డ్యామేజ్ కాకూడదనే బాలయ్యని సైలెంట్ చేశారా?
Balayya Silence.. What is the Reason? డ్యామేజ్ కాకూడదనే బాలయ్యని సైలెంట్ చేశారా?
Advertisement
Ads by CJ

తెలుగుదేశం పార్టీ అంటే మనకి చంద్రబాబు తరువాత గుర్తొచ్చే పేరు బాలకృష్ణ. అతను పార్టీకి స్టార్ క్యాంపైనర్ కూడా. తన మాటల గారడితో అందరిని ఆకర్షించే బాలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తను పోటీ చేసిన నియోజకవర్గమే కాకుండా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసారు. రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం బాలయ్య క్యాంపైనింగ్ గట్టిగానే జరిగింది. 

కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాత్రం బాలయ్య చప్పుడే వినిపించడం లేదు. కారణం అతను ఏదిపడితే అది మాట్లాడడంతో ప్రతిపక్షం వాళ్లు దాన్ని క్యాష్ చేసుకుని ట్రోల్ల్స్ మీద ట్రోల్ల్స్ చేస్తున్నారు.  బాలయ్య ప్రచారం కోసం క్యాండిడేట్లు పోటీ పడుతుంటారు. తమ నియోజకవర్గానికి రమ్మంటే తమ నియోజకవర్గానికి రమ్మంటూ పోటీ పడతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ఆయన వల్ల పార్టీకి లాభం జరగకపోగా.. నష్టం అవుతుందేమో అన్న భయం తెలుగుదేశం నాయకుల్లో పట్టుకుంది. అందుకే బాలయ్యను అధిష్టానం సైలెంట్ గా ఉండమన్నట్లు సమాచారం. అందుకే బాలయ్య తన నియోజకవర్గం అయిన హిందూపూర్ లోనే పరిమితం అయ్యాడు.

Balayya Silence.. What is the Reason?:

Reason Behind Hindupur Candidate Balakrishna Silence

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ