Advertisementt

‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్ట‌ణ కేంద్రం’ టైటిల్‌ పోస్ట‌ర్‌

Wed 20th Mar 2019 11:50 PM
akashvani visakhapatnam kendram,first look,raj kandukuri  ‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్ట‌ణ కేంద్రం’ టైటిల్‌ పోస్ట‌ర్‌
akashvani visakhapatnam kendram First Look ‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్ట‌ణ కేంద్రం’ టైటిల్‌ పోస్ట‌ర్‌
Advertisement
Ads by CJ

‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్ట‌ణ కేంద్రం’ టైటిల్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన నిర్మాత రాజ్‌కందుకూరి

శివ‌, ఉమ‌య హీరో హీరోయిన్లుగా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం ‘ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం’. జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్ నిర్మాత‌. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘సతీష్ బ‌త్తుల తొలిసారి డైరెక్ట‌ర్‌గా మారుతున్న చిత్రం ‘ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం’. ముందు ఈ క‌థ‌ను స‌తీష్ నాకు వినిపించాడు. చాలా బావుంద‌ని అప్రిషియేట్ చేశాను. ఇప్పుడు సినిమాను సిద్ధం చేసి టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌మ‌ని క‌లిశాడు. చాలా మంచి క‌థ‌. త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని భావిస్తున్నాను. నిర్మాత మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్‌గారు నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రం. ఆయ‌న‌కు నిర్మాత‌గా మంచి పేరు, డ‌బ్బును తెచ్చి పెట్టే చిత్ర‌మ‌వుతుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 

చిత్ర నిర్మాత మ‌ర్రి మేక‌ల మ‌ల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ‘‘సతీష్‌గారు క‌థ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఓ మంచి సినిమాను రూపొందించ‌డంలో నిర్మాత‌గా నా వంతు బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తించాను. హీరో శివ‌, హీరోయిన్ ఉమ‌య చ‌క్క‌గా న‌టించారు. మంచి టీం కుదిరింది. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం’’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు స‌తీష్ బ‌త్తుల మాట్లాడుతూ.. ‘‘జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రాం ద్వారా నేను అంద‌రికీ సుప‌రిచితుడినే. అయితే నేను డైరెక్టర్ అవుదామ‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మార‌డం ఆనందంగా ఉంది. మీ అశీర్వాదం ఎప్పటికీ ఉంటుంద‌ని భావిస్తున్నాను. అలాగే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ‘ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్ట‌ణ కేంద్రం’ చిత్రం డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మ‌ల్లిఖార్జున్ స‌పోర్ట్ లేక‌పోతే ఇంత దూరం రాగ‌లిగే వాళ్లం కాము. మేకింగ్‌లో మ‌ల్లిఖార్జున్‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. శివ‌, ఉమ‌య‌, దేవిప్ర‌సాద్‌, మాధ‌వీల‌త ఇలా మంచి ఆర్టిస్టులు కార్తీక్  మ్యూజిక్‌, ఆరీఫ్ సినిమాటోగ్ర‌ఫీ.. ఇలా మంచి టెక్నీషియ‌న్స్ కుదిరారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి మాకు ప్రోత్సాహాన్ని అందించిన రాజ్‌కందుకూరిగారికి థ్యాంక్స్’’ అన్నారు. 

శివ‌, ఉమ‌య‌, దేవిప్ర‌సాద్‌, మాధ‌వీల‌త‌, స‌త్య‌, ధ‌న‌రాజ్‌, సూర్య త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: ప్ర‌దీప్‌, డ్యాన్స్‌: శ్రీకృష్ణ‌, ఎడిట‌ర్‌: ప్ర‌భు, మ్యూజిక్‌: కార్తీక్, సినిమాటోగ్ర‌ఫీ: ఆరీఫ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ బ‌త్తుల.

akashvani visakhapatnam kendram First Look:

Producer Raj Kandukuri releases akashvani visakhapatnam kendram first Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ