సైరా చిత్ర షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. మరోసారి ఈసినిమా రీషూట్ జరుపుకోనుంది. సైరా టీంకు రీషూట్స్ ఏమి కొత్త కాదు. అంతకుముందు ఒకసారి సైరా రీషూట్ మోడ్ లోకి వెళ్లారు. అలా చేయడం వల్ల చాలా ఖర్చు అయింది. అయితే నిర్మాత రామ్ చరణ్ క్వాలిటీ విషయం ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు.
అందుకే రీషూట్స్ మరోసారి తప్పలేదు. నిజానికి చిరంజీవి షూటింగ్ టైంలోనే చాలా సీన్స్ అక్కడే ఓకే చేసేవారు. అవి ఎడిటింగ్ అయ్యాక నచ్చకపోతే రీషూట్ చేస్తున్నారు. అలా ఇప్పుడు కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారు. ఈసినిమాను సమ్మర్ తరువాత విడుదల చేస్తామని నిర్మాత రామ్ చరణ్ గతంలో చెప్పాడు.
కానీ సినిమా లేట్ అవ్వడంతో అసలు ఇది ఈ ఏడాదన్న రిలీజ్ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం షూటింగ్ 90 % కంప్లీట్ అయిందని మిగిలిన 10 % త్వరలోనే కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.