‘చీకటి గదిలో చితకొట్టుడు’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - చిత్ర యూనిట్
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి. జయకుమార్ దర్శకుడు. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకొని సక్సెస్ బాటలో పయనిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అరుణ్ ఆదిత్ హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ పాల్గొన్నారు.
దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ - ‘‘సినిమా విడుదలై రెండు రోజులవుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చిన్న బడ్జెట్‌లో చేసిన ఈ సినిమా ప్రజలకు రీచ్ అయ్యేలా చేసిన మీడియాకు ఈ సందర్భంగా థాంక్స్. సినిమా 2.5 కోట్ల రూపాయలను వసూలు చేసిందని తెలిసి ఆనందపడుతున్నాం. థియేటర్‌లో సినిమా చూసేవాళ్లు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ డైరెక్టర్‌గా నాకు ఆనందంగా ఉంది. సపోర్ట్ చేసిన ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ - ‘‘దర్శక నిర్మాతలు సహా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్. సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలా మంది చాలా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవసరమా? అని అన్నారు. సినిమా చూడకుండానే చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వారందరికీ మా సినిమా మంచి జవాబు చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడికి థాంక్స్. బి, సి సినిమా.. మల్టీప్లెక్స్‌లో వర్క్ అవుట్ కాదని అన్నారు. నా నిర్మాత, దర్శకుడికి థాంక్స్. ఆనందంతో మాటలు రావడం లేదు. ష్యూర్ షాట్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.