లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ నానా హడావిడి చేస్తున్నాడు. 29న పక్కా రిలీజ్ అంటూ ఊదరగొడుతున్నారు. కానీ ఇంతవరకు సెన్సార్ సర్టిఫికెట్ సంపాదించలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళుతున్నాడు. అసలే ప్రేక్షకులు సినిమాలకు కరువాసిపోయి ఉన్న టైం లో.. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని దింపడం ఒక ఎత్తు అయితే.. ఎలక్షన్స్ మూమెంట్ లో ఈ సినిమాని విడుదల చెయ్యడం మరో ఎత్తు. మంచి హాట్ హాట్ ఎన్నికల హడావుడిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రావడం కల్లే అనుకున్నోళ్లకి.... వర్మ కల కనకండి. సినిమా విడుదల చేస్తున్నా అంటూ ఊదరగొడుతున్నారు. అడిగినోళ్ళకి అడగనోళ్ళకి సినిమా 29 రిలీజ్ అంటూ ప్రచారం చేస్తున్నాడు.
అయితే ఎలక్షన్స్ అయ్యే వరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వనని చెప్పిన సెన్సార్.. వర్మ ఒత్తిడికి తలొగ్గి.. ఈ సినిమా సెన్సార్ చెయ్యడానికి రెడీ అయ్యింది. మరి సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందా.. రాదా... అనేది ఇప్పుడు వర్మ ముందున్న అతి పెద్ద సవాల్. ఎందుకంటే.. ఆ సినిమా కథ.. ఎన్టీఆర్ చరమాంకపు బయోపిక్. మరి సినిమాలో ఉన్న పాత్రలు బ్రతికుంటే గనక వారు సెన్సార్ వద్ద అబ్జెక్షన్ పెడితే.. ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని చెబుతారు. మరి ఒకవేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి ఆ పరిస్థితి వస్తుందో లేదో.. తెలియదు. అలాగే ఇప్పటివరకు ఆ సెన్సార్ కార్యక్రమాలు మొదలవ్వలేదు. ఇప్పటికే సెన్సార్ పూర్తయ్యి సినిమా విడుదలపై క్లారిటీ ఉండాల్సింది.
మరి సెన్సార్ బోర్డు ఎవరి ఒత్తిళ్లకన్నా తలొగ్గి.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ ని అబ్జెక్టు చేస్తే వర్మ ఏం చేస్తాడు. అసలు వర్మ మాత్రం సినిమా 29 న విడుదల అంటూ ప్రచారం చేస్తున్నా.. ఎక్కడా ఆ సినిమా విడుదల విషయంలో ప్రేక్షకులకు స్పష్టత రావడం లేదు. సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసి... చివరి నిమిషంలో తుస్ మనిపించడం వర్మ కు వెన్నతో పెట్టిన విద్యే. మరి సజావుగా సెన్సార్ చేసుకుని.. సినిమా ఫస్ట్ ఆట పడేవరకు వర్మని నమ్మడానికి లేదు.