నాగ చైతన్య - సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ మరో 10 రోజుల్లో రిలీజ్ కానుంది. అయితే ఇందులో సమంత కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంది. కాకపోతే కొత్తమ్మాయి అవ్వడంతో మీడియా అటెన్షన్ ఆ అమ్మాయిపై అంతగా పడలేదు. ఇందులో ఈమెకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఇచ్చారు.
చైతుతో ఘాటైన రొమాన్స్ చేస్తూ కనిపించింది దివ్యాన్షా కౌశిక్. కాకపోతే చైతు ఆమెను పెళ్లి చేసుకోడు. పెద్దలు కుదిర్చిన సమంతతో పెళ్లి జరుగుతుంది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న చైతు జీవితం ఎలాంటి మజిలీకి చేరుకుంది అనేది ఈ చిత్రం కథ. అయితే ఇద్దరి హీరోయిన్స్ కి ప్రాధాన్యత సమానంగా ఉంది.
అయితే ఈ చిత్రాన్ని మజిలీ టీం కూడా సమంత సినిమాగానే ప్రొజెక్ట్ చేస్తూ దివ్యాన్షాని పూర్తిగా సైడ్‌కి నెట్టేసారు. దాంతో పాపం దివ్యాన్షా కౌశిక్ తన తొలి సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీడియా కవరేజ్ కావాలంటూ తన మేనేజర్‌ని బతిమాలుకుంటోంది. కానీ మీడియా వాళ్ళు ఫోకస్ మొత్తం చైతు - సమంత పైనే. ఎందుకంటే పెళ్లి తరువాత చేస్తున్న తొలి చిత్రం కాబట్టి. సినిమా విడుదల తన నటనతో దివ్యాన్షా కౌశిక్ ఎన్ని మార్కులు వేసుకుంటుందో చూద్దాం.